Thursday, April 25, 2024
- Advertisement -

మహేశ్‌తో రాజమౌళి సినిమాపై అప్‌డేట్

- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో దర్శకధీరుడు రాజమౌళి సినిమా ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా ఎలా ఉండబోతోంది ? అందులో హీరోయిన్ ఎవరు ? తదితర వివరాల కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు జక్కన్న తాజా అప్‌డేట్ చెప్పారు. మహేశ్‌ బాబుతో సినిమా కోసం స్టోరీ తయారు కావడానికి 7 నెలల సమయం పడుతుందన్నారు.

ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. సాధారణంగా రాజమౌళి సినిమా అంటే ఎంత లేదన్నా రెండేళ్లు పడుతుంది. దాంతో ఈ సినిమాకు కూడా రెండు నుంచి మూడేళ్ల సమయం పట్టొచ్చని చెబుతున్నారు.

మహేశ్ సినిమా ఆఫ్రికా అడవుల్లో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్ తరహా కథతో సాగుతుందని రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలో వెల్లడించారు. అయితే అదే తరహా కథను ఓకే చేస్తారా ఏమైనా మార్పులు ఉంటాయా అన్నది తెలియాంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

పూరీ జనగణమనలో హీరోయిన్ ఎవరంటే ?

మెగాస్టార్ కమిట్‌మెంట్ పై ప్రశంసలు

త్వరలో ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ మూవీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -