Friday, March 29, 2024
- Advertisement -

మరో రికార్డు బద్దులు కొట్టిన ఆర్ఆర్ఆర్

- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డు నెలకొల్పే దిశగా దూసుకుపోతోంది. రాజమౌళి సృజనాత్మకతకు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్‌చరణ్ నట విన్యాసాలు తోడు కావడంతో బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది.

ఇప్పటికే గుంగూభాయి కతియావాడి, ది కశ్మీర్ ఫైల్స్, హిందీ బాహుబలి కలెక్షన్లను క్రాస్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ ‘2.0’ కలెక్షన్లను అధిగమించింది. రజనీకాంత్ 2.0 బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.800 కోట్లు గ్రాస్ వసూలు చేస్తే…ఆర్ఆర్ఆర్ కేవలం 10 రోజుల్లోనే ఆ మార్క్‌ను దాటేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 819 కోట్లు వసూళ్లు రాబట్టింది. స్ట్రైట్ సినిమాలను పక్కకు నెట్టి కేవలం బాలీవుడ్‌లోనే 200 కోట్ల వసూళ్లతో సత్తా చాటింది. దీంతో భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో చిత్రంగా నిలిచింది. ముందు ముందు మరెన్ని రికార్డు సృష్టిస్తుందో చూడాలి.

హాలీవుడ్ ఎంట్రీకి ప్రభాస్ సిద్ధమవుతున్నాడా ?

పూరీ జనగణమనలో హీరోయిన్ ఎవరంటే ?

ఐటమ్ సాంగ్ కోసం రష్మిక ఎంత డిమాండ్ చేస్తోందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -