Monday, April 29, 2024
- Advertisement -

నిఖిల్ ‘18 పేజీస్’ ఫ‌స్ట్ లుక్ ఎప్పుడో తెలుసా?

- Advertisement -

హ్యాపీడేస్ తో వెండి తెరకు పరిచయం అయిన నిఖిల్ తర్వాత స్వామిరారా, సూర్యా వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ మద్య అర్జున్ సురువరంతో మంచి హిట్ అందుకున్న తర్వాత కరోనా ప్రభావంతో తన సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం కార్తికేయ 2 లో నటిస్తున్నాడు.

సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో బన్నీవాసు నిర్మాణంలో‘18 పేజెస్’ చిత్రంలో నిఖిల్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా వాస్తవానికి ఈ పాటికే చిత్రీకరణను పూర్తి చేసుకోవాలి. కానీ కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది.

ఈ సినిమా ఫస్టులుక్ ను నిఖిల్ పుట్టిన రోజైన జూన్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా వదిలారు. పోస్టర్లో ఒక వైపు చేతిలో స్మార్ట్‌ఫోన్ పట్టుకొని, మరోవైపు ఒక వ్యక్తి పేజీలో వ్రాస్తున్నట్లు ఉండడం చూడొచ్చు. గోపీ సుంద‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు.

అమ్మ నాన్న బ్రేకప్ పై శృతి హాసన్ రియాక్షన్.. విడిపోవడమే కరెక్ట్ అంటూ?

ఇది సమయం కాదు.. జూడాల సమ్మేపై సీఎం కేసీఆర్ ఆగ్రహం

నన్ను మానసికంగా వేధిస్తున్నారు.. నటి గీతాంజలి ఆవేదన!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -