అగ్ర హీరోల సినిమాలూ ఓటీటీ బాటే.. తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్​..!

- Advertisement -

పెద్ద హీరోల సినిమాల విడుదల అంటే ఓ పండగలా ఉంటుంది. థియేటర్ల దగ్గర సందడి వాతావరణం ఉంటుంది. అభిమాన సంఘాల డ్యాన్స్​లు చేస్తూ సంబురాలు చేసుకుంటారు. ఇక సినిమా హాల్​ లోకి వెళ్లాక .. హీరో ఇంట్రడక్షన్​ సీన్​ దగ్గర నుంచి హడావుడి ఉంటుంది. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్​తో సినిమా థియేటర్లు ఓపెన్​ కావడం లేదు. థియేటర్లు ఓపెన్​ చేసుకొనేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినప్పటికీ తెరుచుకోవడం లేదు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి.

తాము ఎంతో నష్టపోయామని.. కాబట్టి ప్రభుత్వం తమ విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని థియేటర్​ యజమానులు కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ప్రస్తుతం ఓటీటీల యుగం నడుస్తోంది. కరోనా లాక్​డౌన్​ కంటే ముందు థియేటర్​లో రిలీజ్​ అయిన కొద్ది రోజులకు సినిమాలు ఓటీటీలోకి వచ్చేవి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.. కొన్ని పెద్ద సినిమాలు సైతం నేరుగా థియేటర్లలో విడుదలవుతున్నాయి. ఇక థియేటర్లు తెరుస్తారు.. అందులోనే సినిమాలు చూడొచ్చు అని ఆశపడుతున్న ఫ్యాన్స్​ నిర్మాతల నిర్ణయాలతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

తాజాగా సురేశ్​ ప్రొడక్షన్స్​ సంచలన నిర్ణయం తీసుకున్నది. నారప్ప, విరాటపర్వం చిత్రాలను నేరుగా ఓటీటీలోనే విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. దీంతో అంతా షాక్ అయ్యారు.’ప్రస్తుతం థియేటర్లలో విడుదల సాధ్యం కావడం లేదు. మంచి రేట్​ వచ్చిందని ఓటీటీలో విడుదల చేస్తున్నాం తప్పేంటి’ అంటూ సురేశ్​ బాబు అంటున్నారు. వెంకీ మరో మూవీ దృశ్యం 2 కూడా ఓటీటీ లోనే విడుదల అవుతుందని అంటున్నారు. కాగా, థియేటర్​ యజమానులకు.. చిత్ర నిర్మాతలకు మధ్య ఈ విషయంలో బేదాభిప్రాయాలు ఉన్నాయి.

నేరుగా ఓటీటీలో సినిమాలు విడుదల చేయొద్దంటూ థియేటర్​ యజమానులు ఇప్పటికే డిమాండ్​ చేశారు. అయినప్పటికీ సురేశ్​ బాబు మాత్రం ఓటీటీలో సినిమాల విడుదల ప్రకటించారు. అయితే తెలుగులో ఇంతవరకు స్టార్​ హీరో సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కాలేదు. ప్రస్తుతం వెంకటేశ్​ నటించిన నారప్ప ఓటీటీలో విడుదల కావడంతో.. త్వరలోనే మరికొందరు స్టార్​ హీరోల సినిమాలు కూడా ఓటీటీలో విడుదలయ్యే చాన్స్​ ఉందంటున్నారు సినీ విశ్లేషకులు. కానీ ఫ్యాన్స్​ మాత్రం నిరాశలో ఉన్నారు.

Also Read

సోషల్ మీడియా సినీ ఇండస్ట్రీకి ప్లస్సా.. మైనస్సా..!

ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే ‘సౌత్ ఇండస్ట్రీయే’..!

జనాలు ఓటీటీలకు అలవాటయ్యారా?

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -