తమిళ నటి వనితా విజయ్ కుమార్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటారు. సీనియర్ నటి మంజుల, నటుడు విజయ్ కుమార్ పెద్ద కుమార్తె వనిత. ఈమె కొన్నేళ్ల క్రితం తమిళ బిగ్‌బాస్ షోలో ఆమె పాల్గొన్నారు. ఆ తర్వాత కొన్ని టీవీ షోల్లోనూ ఆమె కనిపించారు. కానీ నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనంగా నిలుస్తుంటారు.
ఇక ఆమె వ్యక్తిగత విషయాలు సైతం నిత్యం వివాదాస్పదం అవుతూ ఉంటాయి. ఇప్పటికే వనిత విజయ్ ముగ్గురు వ్యక్తులను వివాహం చేసుకొని.. వారితో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మరోసారి వార్తల్లోకి ఎక్కారు వనితా.. ఆమె ఇంట్లో ఇటీవల కుబేరుడి పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా వనిత ఆమె కుమార్తె నోట్ల కట్టలతో దండలు వేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు నెటిజన్లు వనితపై కామెంట్లు పెడుతున్నారు.
ఇటీవల ఓ టీవీ షోనుంచి ఎలిమినేట్ అయిన వనిత.. ఆ టీవీ షో హోస్ట్ రమ్యకృష్ణపై కామెంట్లు చేశారు. తనను బలవంతంగా బయటకు పంపించిందంటూ ఆరోపించారు. మళ్లీ ఇంతలోనే నోట్ల కట్టలతో దండలు వేసుకొన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం గమనార్హం. అయితే కుబేరుడి పూజల్లో ఇలా దండలు వేసుకోవడం కామన్ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.
Also Read
ప్రభాస్ కొత్త సినిమా అప్డేట్ వచ్చేది అప్పుడే..!
