అల్లు అర్హ బిగ్ స్క్రీన్ పై ఎంట్రీ కన్ఫర్మ్.. అల్లు అర్జున్ ఎమోషనల్ ..!

అల్లు ఫ్యామిలీ నుంచి మరో యాక్టర్ వెండి తెరపైకి వస్తున్నారు. తన హాస్యంతో తెలుగు తెరపై నవ్వుల నింపిన అల్లు రామలింగయ్య వందలాది సినిమాల్లో నటించారు. మూడు తరాల జనరేషన్స్ తో కలిసి పోటీ పడి నటించారు. ఆయన తర్వాత ఆయన కుమారుడు అల్లు అరవింద్ కూడా కొన్ని సినిమాల్లో నటించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అగ్ర నిర్మాత గా ఎదిగారు.

ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ టాలీవుడ్ లో అగ్ర హీరోల్లో ఒకడిగా ఎదిగాడు. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అల్లు అర్జున్ కు కొడుకు అయాన్, కూతురు అర్హ ఉన్నారు. అల్లు వారి చిట్టి తల్లి సినిమాల్లో బాల నటిగా ఎంట్రీ ఇస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలు నిజం అయ్యాయి.

అల్లు అర్హ దిల్ రాజు, గుణ శేఖర్ నీలిమ నిర్మాణంలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో సమంత శకుంతల గా, మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి గా నటిస్తున్నారు. తన కుమార్తె అల్లు అర్హ సినిమాల్లోకి అరంగేట్రం చేయడం పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.

‘అల్లు ఫ్యామిలీ నుంచి ఫోర్త్ జనరేషన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం గర్వంగా ఉంది. సమంతతో వైవిధ్యమైన జర్నీ సాగించాను. ఆమె సినిమా ద్వారా అల్లు అర్హ నటిగా పరిచయం అవుతుండడం సంతోషంగా ఉంది. తన కుమార్తెకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాత ఈ నీలిమకు కృతజ్ఞతలు. శాకుంతలం సినిమా టీం కు అభినందనలు.’ అంటూ ట్వీట్ చేశారు. అల్లుఅర్జున్ తనయ సినిమాల్లోకి రావడంపై అల్లు అర్జున్అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్హ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Also Read

గర్జించిన రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్..!

చేతినిండా సినిమాలుండే స్టార్ హీరో.. కాలేజ్ డేస్ లో ఏం చేసేవాడో తెలుసా..!

నవీన్​ పొలిశెట్టితో మూవీకి నో చెప్పిన స్వీటీ..!

Related Articles

Most Populer

Recent Posts