సింగం సిరీస్ లో భాగంగా వస్తున్న మూడో చిత్రం ఎస్3. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా టీజర్ కు సూపర్ రేస్పాన్స్ వస్తుంది.. ప్రతీ ఫ్రేమ్ ఆకట్టుకుంటుంది. ది ఇంటర్నేషనల్ కాప్ అంటూ ఎస్3 కి పెట్టిన ట్యాగ్ లైన్ కి న్యాయం చేస్తూ.. దేశవిదేశాల్లో భారీ ఖర్చుతో యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరించారు.
ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గట్లుగానే టీజర్ మొత్తాన్ని సూర్య డైలాగ్స్.. ఫైట్స్ తోనే నడిపించారు. ప్రతీ ఫ్రేమ్ లోనూ గ్రాండియర్ కనిపిస్తుండగా.. ఒక్క ఫ్రేమ్ కనిపించిన చాలా క్యూట్ ఉంది అనుష్క. సింగం సిరీస్ కు ఏమాత్రం తగ్గకుండా హారిస్ జైరాజ్ గ్రాండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఓవరల్ గా సింగం మూడుకు మూడ్ బాగా వచ్చింది.