Friday, April 26, 2024
- Advertisement -

కాంగ్రెస్​ లోక్​సభాపక్షనేతగా ఉత్తమ్​?

- Advertisement -

టీపీసీసీ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన ఉత్తమ్​కుమార్​రెడ్డికి జాతీయ స్థాయిలో కీలక పదవి దక్కబోతున్నదా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కాంగ్రెస్​ లోక్​సభ పక్ష నేతగా ప్రస్తుతం రంజన్​ చౌదరి కొనసాగుతున్నారు. అయితే ఆయన స్థానంలో మరో ఎంపీని నియమించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నదట. ఇందుకోసం పలువురు కీలక నేతల పేర్లను పరిశీలిస్తున్నారు. అందులో ఉత్తమ్​ కుమార్​రెడ్డి పేరు కూడా ఉండటం గమనార్హం.

జూలై 19 నుంచి పార్లమెంట్​ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లోక్​సభ పక్ష నేతగా రాహుల్​ గాంధీ వ్యవహరించబోరని ఇప్పటికే ఆ పార్టీ క్లారిటీ ఇచ్చేసింది. మరోవైపు గతంలో కాంగ్రెస్​ అధిష్ఠానంపై లేస్ ఖాస్త్రం సంధించిన నేతల పేర్లను కూడా పరిశీలిస్తున్నారట. గతంలో కొందరు నేతలు కాంగ్రెస్​ పార్టీ విధానాలను తప్పుబడుతూ సోనియాగాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. ఆ గ్రూప్​లో మొత్తం 23 మంది సీనియర్​ కాంగ్రెస్​ నేతలు ఉన్నారు. వీరిలో ఒకరికి లోక్​సభపక్షనేత పదవి దక్కే చాన్స్​ ఉందన్న వార్త వినిపిస్తోంది.

ఈ లిస్ట్​లో శశి థరూర్, మనీష్‌ తివారీ ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్​రెడ్డి నియామకమయ్యాక.. ఉత్తమ్​కు జాతీయస్థాయిలో కీలక పదవి దక్కుతుందని వార్తలు వినిపించాయి. తాజాగా ఆయన పేరు వినిపిస్తోంది. అధిర్‌ రంజన్‌ చౌదరి ప్రస్తుతం లోక్‌సభాపక్ష నేత గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన పశ్చిమబెంగాల్ పీసీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనను లోక్​సభపక్షనేతగా ఈ పదవి నుంచి తప్పించబోతున్నారు.

Also Read

సీఎంకు షర్మిల సవాల్​.. ముక్కు నేలకు రాయాలంటూ చురకలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -