సినిమా అంటే ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు హీరో విక్రమ్. సినిమా కోసం వైవిద్యమైన పాత్రలు చేస్తుంటాడు. ప్రేక్షకులకు కొత్తధనం అందించడానికే ప్రయత్నిస్తుంటాడు. ఇప్పుడు విక్రమ్ నుంచి మరో వైవిధ్యమైన సినిమా వస్తోంది. ఆ చిత్రం ‘ఇరుముగన్’. ఈ సినిమా ట్రైలర్ బయటికివచ్చింది.
ప్రస్తుతం ఈ ట్రైలర్ కి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా ఫుల్ ప్యాక్ యాక్షన్ ఎంటర్ ట్రైనర్ అని చెప్పకనే చెప్పేసిందీ ట్రైలర్. ఇక భారీదనం గురించి ప్రతేకంగా చెప్పుకోవాలి. ట్రైలర్ ప్రతీ షాట్ అదిరిపోయింది. చాలా లావిష్ గా తెరకెక్కించారీ సినిమా. మొత్తం ఫారిన్ షూటింగే. ఓ హాలీవుడ్ సినిమా ఫీల్ ఇచ్చింది.
సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్రమ్ మూడు విభిన్న పాత్రలలో కనిపించాడు. ఇందులో ఒకటి సైంటిస్ట్ పాత్రకూడా వుంది. ఈ పాత్రలో విక్రమ్ లుక్కు అదిపోయింది. మొత్తమ్మీద సినిమా పై అంచనాలు పెంచేసింది ట్రైలర్. ఆనంద్‌శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఇంకొక్కడు’పేరుతో విడుదల చేస్తున్నారు.
{youtube}v=L_0jexAQsB0{/youtube}
Related
