Friday, May 17, 2024
- Advertisement -

బంపర్ ఆఫర్ కొట్టిన ఓంకార్!

- Advertisement -

బుల్లితెర యాంకర్ గా మొదలుపెట్టి బాగా ఫాపులర్ అయ్యాడు ఓంకార్. ఆ తర్వాత సెలబ్రిటీ అయ్యాడు. యాంకర్ ఓంకార్ దర్శకుడిగా జీనియస్ అనే సినిమాని తీసాడు. ఈ చిత్రం ఆశించిన విజయం అందుకోలేకపోయిన తర్వాత తన సెకండ్ సినిమా తో మంచి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత అతను ఫలానా స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడనే వార్తలు బాగానే వినిపించాయి.

కానీ రాజుగారి గది వచ్చి యేడాది పూర్తవుతోన్న ఓంకార్ నుంచి కొత్త సినిమా ప్రకటన రాలేదు. అయితే లేటెస్ట్ గా ఓంకార్ ఓ బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు చెబుతున్నారు. విక్టరీ వెంకటేష్ తో తన మూడో సినిమా చేయబోతున్నాడట ఓంకార్. ఈ సినిమా కూడా హారర్ కామెడీగా తీయబోతున్నాడట.

ఇదంతా ఓ ఎత్తైతే ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి ప్రముఖ బాలీవుడ్ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయబోతుండటం. ఏదేమైనా ఓంకార్ పడ్డ కష్టానికి రాజుగారి గది ఫలితాన్నే కాదు.. విక్టరీ వెంకటేష్ సినిమాతో ప్రమోషన్ కూడా ఇచ్చింది. మరి ఇది ఏ తరహాలో సాగే హారర్ కామెడీనో గానీ.. వెంకీకి కూడా ఇది కొత్త తరహా సినిమాగా మిగులుతుందని చెప్పొచ్చు.

Related

  1. రష్మీకి సూపర్ ఆఫర్!
  2. ఎన్టీఆర్ కి రీమేక్ ఆఫర్ ?
  3. అడల్ట్ సినిమాలో యాంకర్ శ్రీముఖి!
  4. యాంకర్ ప్రదీప్ ఇప్పుడు హీరో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -