Thursday, May 2, 2024
- Advertisement -

పెళ్లి చూపులలో బిజీ గా టాలీవుడ్ సెలెబ్రిటీ లు

- Advertisement -

విడుదలకి ముందరే క్రిటిక్ లు అందరికీ సినిమా చూపించేసి పాజిటివ్ రివ్యూ లు సంపాదించుకుని సినిమా విడుదల టైం కి మంచి హైప్ తెప్పించారు పెళ్లి చూపులు సినిమా బృందం. పెద్ద ప్రొడ్యూసర్ సురేష్ బాబు సినిమాని కొనడంతో ఈ సినిమా ప్రమోషన్ కి ఎలాంటి ఇబ్బందీ లేకుండా పోయింది. ఒక్కొక్కళ్ళూ ఇప్పుడు ఈ సినిమా చూడడం కోసం ఎగబడుతున్నారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

ఏకంగా రాజమౌళి అంతటి వాడు రివ్యూ ఇచ్చి సినిమా ఎలా ఉందొ చెప్పడం తో జనాలు థియేటర్ ల వైపు పరిగెడుతున్నారు. రాజమౌళి దెబ్బతో సెలెబ్రిటీ లు పెళ్లి చూపులకి క్యూ కట్టేశారు. ‘ఇప్పుడే పెళ్లి చూపులు చూసి ఈ వారాన్ని సూపర్ గా స్టార్ట్ చేశా. ఫ్రెష్ ఎయిర్ పీల్చుకున్నట్లుగా ఉంది.  మీరంతా ఇరగదీసేశారు. పెళ్లిచూపులు టీమ్ ని గట్టిగా అభినందించాల్సిందే’ అని ట్వీట్ చేశాడు అక్కినేని నాగ చైతన్య.

‘పెళ్లిచూపులు అద్భుతమైన సినిమా. విజయ్-రీతు-నందు అందరూ సూపర్ గా పెర్ఫామ్ చేశారు. ముఖ్యంగా ఫ్రెండ్ కేరక్టర్ అయితే విపరీతంగా నవ్వించింది. దర్శకుడితోపాటు టీమ్ అందరికీ కంగ్రాట్స్’ అంటూ నితిన్ ట్వీట్ చేశాడు. సెలబ్రిటీల ట్వీట్లతో ఈ మూవీ రేంజ్ మరింతగా పెరిగిపోతోంది. ఇప్పటికే మాంచి వసూళ్ళు వస్తుంటే.. ఈ దెబ్బకి ఇంకా పెరిగే ఛాన్సుంది మరి.

Related

  1. పెళ్లి చూపులు మూవీ రివ్యూ!
  2. ఎన్టీఆర్ కి రాజమౌళి షాక్!
  3. అనుష్క పై రాజమౌళికి కోపం వచ్చింది!
  4. రాజమౌళి కొడుకు ఏం చేస్తున్నాడు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -