Friday, April 26, 2024
- Advertisement -

ల‌వ‌ర్ బాయ్ గా బాహుబ‌లి

- Advertisement -

బాహుబ‌లి చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి ల‌వ‌ర్ బాయ్ గా మార‌బోతున్నాడు. ప్ర‌భాస్ లో కొత్త కోణం చూపించేందుకు సిద్ధ‌మ‌య్యాడు ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌. ప్ర‌భాస్ తాజా చిత్రం రాధేశ్యామ్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్చి 11న విడుద‌ల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు, ట్రైలర్ విడుదల కాగా.. తాజాగా రిలీజ్ ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

హస్తసాముద్రికుడి పాత్ర పోషిస్తున్న ప్రభాస్ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో హస్త సాముద్రికుడి పాత్ర పోషిస్తున్నా.. నిజ జీవితంలో మాత్రం ఇప్పటివరకూ ఎప్పుడూ ఏ జ్యోతిషుడి ముందు చేయి చూపించుకోకపోవడం విశేషం.

ఆ అవసరం రాదని అంటున్నాడు. తన వరకూ తాను ఎప్పుడూ అదృష్టం, విధి రాతనే నమ్ముతానంటున్నాడు. రాధేశ్యామ్ సినిమాలో హస్త సాముద్రికుడి పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయానని..ఆసక్తిగా ఏర్పడిందని చెప్పాడు. ప్ర‌భాస్ చేతిలో ప్ర‌స్తుతం ఆదిపురుష్, రాధేశ్యామ్, సాలార్, స్పిరిట్, ప్రోజెక్ట్ కే సినిమాలున్నాయి.

మనసులో మాట బయటపెట్టిన సామ్

దీపం ఉండగానే చక్కబెట్టుకుంటున్న కన్నడ బ్యూటీ

విజయ్ దేవరకొండ పాన్ ఇండియా ప్రేమకథ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -