Saturday, May 11, 2024
- Advertisement -

జనతగ్యారేజ్ 25 డేస్ కలెక్షన్స్!

- Advertisement -

ఎన్టీఆర్ హీరోగా, సమంత, నిత్యమీనన్ హీరోయిన్స్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జనతా గ్యారేజ్. ప్రస్తుతం ఈ సినిమా రికార్డులన్నిటికీ రిపేర్ చేస్తూ దూసుకుపోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు 50 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యింది.

దాంతో ఈ సినిమా ఇప్పుడు కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర చేసిన ఈ సినిమా మాస్, క్లాస్ అని తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రాణం పోసింది. అయితే ఈ సినిమా నిన్నటితో 25 రోజులు పూర్తి చేసుకుంది.

ఈ 25 రోజులు పూర్తి చేసుకున్న జనతా గ్యారేజ్ మొత్తం 131 కోట్లను వసూలు చేసింది.  ఒక్క యూఎస్ లోనే 12 కోట్ల గ్రాస్ ని రాబట్టి ఇది వరకు అక్కడ “నాన్నకు ప్రేమతో” ఉన్న రికార్డులను తుడిచి వేసింది. అత్యంత వేగంగా 50, 100 కోట్ల క్లబ్బులో చేరిన ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే అత్తారింటికి దారేది, సరైనోడు చిత్రాల కలెక్షన్లను దాటేసింది.  త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రాన్ని అధికమించనుంది. బాహుబలిని మినహాయించి అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా జనతా గ్యారేజ్ టాప్ పొజిషన్లో నిలువనుంది.

Related

  1. ఎన్టీఆర్ కి భయపడ్డ అల్లు అర్జున్!
  2. ఎన్టీఆర్‌ ని వదిలి బన్నీ కోసం వచ్చాడు
  3. పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు ఘోర అవమానం!
  4. ఎన్టీఆర్ కి జగన్ కి లింక్ ఏంటి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -