పాన్ ఇండియా మూవీకి సిద్ధమవుతున్న యంగ్ టైగర్

- Advertisement -

ఆర్ఆర్ఆర్ తర్వాత మంచి జోష్ మీదున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇదే జోరు మీద మరో పాన్ ఇండియా మూవీకి సిద్ధమవుతున్నాడు. ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్ తో సూపర్ హిట్ సొంతం చేసుకున్న కొరటాల శివ ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. ఇది యంగ్ టైగర్ కు 30వ చిత్రం. పవర్ పుల్ యాక్షన్ మూవీగా ఈ సినిమాను పట్టాలెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

యువసుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చేతిలో కత్తి పట్టుకుని పవర్ పుల్ లుక్ లో ఎన్టీఆర్ అలరించాడు.

- Advertisement -

‘అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి ఉండకూడదని…. అప్పుడు భయానికి తెలియాలి తాను రావాల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా అంటూ యంగ్ టైగర్ చెప్పే డైలాగ్ అలరిస్తోంది.

చిరంజీవితో రాధిక మూవీ

ప్రభాస్ మూవీలో కియారా..?

ఆ తెలుగు హీరో తో రొమాన్స్ సీన్స్ చేయాలని ఉంది: మాళవిక

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -