ప్రభాస్ మూవీలో కియారా..?

పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ తో సినిమా చేయడానికి స్టార్ ప్రొడ్యూసర్లు సైతం క్యూకడుతున్నారు. డార్లింగ్ కెరీర్ లో 25వ చిత్రానికి సంబంధించి ఓ ప్రచారం తెరపైకి వచ్చింది. సందీప్ రెడ్డి వంగా..ప్రభాస్ హీరోగా స్పిరిట్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ప్రభాస్ 25వ చిత్రం. అయితే ఈ సినిమాలో కియారా అద్వానీ.. హీరోయిన్ గా చేస్తోందంటూ ప్రచారం జరుగుతోంది.

చేసినవి కొన్ని చిత్రాలే అయితే బాలీవుడ్, టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కియారా. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న తెలుగు మూవీలో కియారా నటిస్తోంది. అయితే స్పిరిట్ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు మరికొంత సమయం పట్టేలా ఉంది.

ఇటు ప్రభాస్.. అటు సందీప్ వారి వారి సినిమాలతో బిజీబిజీగా ఉండటమే ఇందుకు కారణం. అయితే ప్రభాస్ 25వ చిత్రంలో కియారా నటించనుందంటూ జరుగుతున్న ప్రచారానికి ఆమె తరపు అధికార ప్రతినిధి చెక్ పెట్టారు. స్పిరిట్ కోసం కియారాను ఇంకా ఎవరూ కలవలేదని తేల్చిచెప్పారు.

మహేశ్ మూవీలో పెళ్లి సందడి బ్యూటీ

రాజమౌళి, మహేశ్ మూవీపై లేటెస్ట్ అప్ డేట్

సర్కారీ వారి పాటలో మొదట అనుకున్నది ఆ హీరోనే

Related Articles

Most Populer

Recent Posts