చిరంజీవితో రాధిక మూవీ

- Advertisement -

ఆచార్య మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి.. ఇదే జోరుతో వరుసగా మరో మూడు సినిమాలు పట్టాలెక్కించనున్నారు. మారుతి, వెంకీ కుడుములు తదితర దర్శకులతో చిరు మూవీ చేయబోతున్నారు. మరో ఐదు కథలు కూడా మెగా స్టార్ కోసం రెడీ అవుతున్నాయి. తాజాగా చిరుతో ఓ భారీ మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అలనాటి నటి రాధిక శరత్ కుమార్. ఒకప్పుడు చిరంజీవి, రాధిక కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి.

ఇప్పటికీ చిరు ఫ్యామిలీతో రాధికకు సత్సంబంధాలు ఉన్నాయి. చిరంజీవితో తన మూవీని ప్రకటిస్తూ రాధిక ట్వీట్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. థ్యాంక్యూ డియర్ చిరంజీవి.. మా బ్యానర్ రాడాన్ మీడియా వర్క్స్ లో ఓ ప్రాజెక్టు చేయడానికి అంగీకారం తెలిపినందుకు… కింగ్ ఆఫ్ మాస్ అయిన మీతో ఓ బ్లాక్ బస్టర్ తీయడానికి ఎదురు చూస్తున్నానంటూ రాధిక ట్వీట్ చేశారు.

- Advertisement -

ఇప్పటికే ఇదే బ్యానర్ లో రాధిక తెలుగు, తమిళ్, మలయాళంలో ఎన్నో సీరియల్స్ తీశారు. తమిళంలో అరడజన్ సినిమాలు చేశారు. అయితే తెలుగులో మాత్రం చిరంజీవితోనే ఈ మెగా ప్రాజెక్టు స్టార్ట్ చేస్తుండటం విశేషం.

మహేశ్ మూవీలో పెళ్లి సందడి బ్యూటీ

రాజమౌళి, మహేశ్ మూవీపై లేటెస్ట్ అప్ డేట్

ఐటమ్ సాంగ్ కోసం రష్మిక ఎంత డిమాండ్ చేస్తోందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -