Saturday, May 11, 2024
- Advertisement -

జనత గ్యారేజ్ కి యాభై కోట్లు .. సూపర్ అచ్చీవ్మేంట్

- Advertisement -

గత గురువారం విడుదలైన జనతా గ్యారేజ్ కలెక్షన్లు బాగానే ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రూ. 50 కోట్లను జనతా కలెక్ట్  చేసిందని కూడా వార్తలు వస్తున్నాయి. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ. 50 కోట్లు మార్కు దాటిన చిత్రంగా జనతాని చెబుతున్నారు.

వీక్ ఎండ్ కలిసి రావడం తరువాత వినాయక చవితి సెలవు కూడా ఉండటం జనతా కలెక్షన్లను ప్లస్ అయిందని చెప్పుకోవాలి. ఈ వారంతానికి జనతా లాభాల్లోకి వచ్చేసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. తారక్ కూడా ఇదే ఖుషీతో ఉన్నాడటని సమాచారం. యూనిట్ సభ్యులతో ఇప్పటికే పార్టీ చేసుకున్నాడట. ఒక పబ్ లో గ్రాండ్ పార్టీ ఇచ్చాడట తారక్. దర్శకుడు కొరటాల శివ కూడా సక్సెస్ మీట్ పెట్టేశారు.

త్వరలోనే మీడియా మిత్రులకు కూడా గ్రాండ్ పార్టీ ఇవ్వాలని గ్యారేజ్ టీమ్ అనుకుంటున్నట్టు సమాచారం. ఇదే క్రమంలో అభిమానులతో కూడా ఈ ఆనందాన్ని పంచుకునేందుకు జనతా గ్యారేజ్ టీమ్ సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. జనతా గ్యారేజ్ విజయోత్సవాన్ని విశాఖపట్నంలో భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. అభిమానుల మధ్యలో సంబరాలు జరుపుకునేందుకు ప్లాన్ సిద్ధం చేసుకున్నారట.

గతంలో అల్లు అర్జున్ కూడా విశాఖలో ‘సరైనోడు’ చిత్రం ప్రీ రిలీజ్ పండుగ చేసుకున్నాడు. అదే ప్లేస్ లో జనతా విజయోత్సవం నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ విజయోత్సవాన్ని ఈనెల 9వ తేదీన నిర్వహించాలని ప్రాథమికంగా ఫిక్స్ అయ్యారు. అయితే అదే రోజున పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాకినాడలో భారీ బహిరంగ సభ ప్లాన్ చేశారు.

సహజంగా ఆరోజున జనమంతా అటువైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మర్నాడున జనతా విజయోత్సవం ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. విశాఖలో విజయోత్సవం ఏరోజున జరుగుతుందనేది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సరైనోడు పంక్షన్ జరిగిన ప్రదేశంలోనే జనతా కూడా సక్సెస్ మీట్ పెట్టుకోవడం విశేషం. అంటే ఆ ప్లేసు సక్సెస్ మీట్లకు సెంటిమెంట్ గా మారుతుందేమో..? అదీ ఒకరకంగా మంచిదే కదా!

Related

  1. జానతా అద్భుత కలక్షన్ లు
  2. జనతా గ్యారేజ్ రివ్యూ…!
  3. జనతా గ్యారేజ్ సెన్సార్ రివ్యూ!
  4. విక్రం ఈ సారైనా ?
  5. జనత గ్యారేజ్ కి పోటీగా ఎవరు…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -