Friday, May 3, 2024
- Advertisement -

జనత గ్యారేజ్ కి పోటీగా ఎవరు…?

- Advertisement -

జనతా గ్యారేజ్ సినిమాకి ఎవరైనా పోటీగా వస్తారా అని అనుకున్నారు జనత నిర్మాతలు. కానీ చుట్టుపక్కల ఎవ్వరూ కూడా ఈ సినిమాతో పోటీకి రావడం లేదు. ఫ్రీగా పోటీ లేకుండా విడుదల అవుతున్న జనత కి వారం ఇటూ వారం అటూ కూడా సినిమాలు ఏమీ లేవు.

అయితే సినిమాలోపల చాలా పెద్ద ఆర్టిస్ట్ లు ఉన్నారు. మోహన్ లాల్ , ఎన్టీఆర్ , నిత్య మీనన్ , సమంత ఇలా బోలెడు కాస్ట్ ఉంది అయితే వాళ్ళలో వాళ్లకి ఎలాంటి ఆసక్తికర పోటీ ఉంటుంది అని చెప్పడం కూడా సులువు కాదు. ఈ విషయం డైరెక్ట్ గా జనత టీం ని అడిగేస్తే ఏమన్నారో చూడండి. 

‘దొరికిన పాత్రలో పెర్ఫామ్ చేయడానికి బోలెడంత స్కోప్ ఉన్నప్పుడు.. ఇక ఒకరికి ఒకరు మధ్యన కాంపిటీషన్ ఏముంటుంది? మోహన్ లాల్ గారు కంప్లీట్ యాక్టర్ మాత్రమే కాదు.. కంప్లీట్ హ్యుమన్ బీయింగ్ కూడా. ఉన్నదాంట్లో తృప్తి పొందడంలో ఆయన చాలా హ్యాపీ మ్యాన్. అలాగే ఇతర యాక్టర్లందరూ కూడా.. ఎవరికివారు ఇరగదీశారు” అన్నాడు ఎన్టీఆర్. ఇంతకీ సినిమాలో అసలు ఎన్టీఆర్ అండ్ మోహన్ లాల్ క్యాస్టింగ్ ఎలా జరిగింది? ఈ ప్రశ్నకు కొరటాల శివ సమాధానం చెప్పాడు.

”నేను కథ రాసేటప్పుడే ఇది ఎన్టీఆర్ కు అనుకున్నాను. అలాగే మోహన్ లాల్ పాత్రకు కూడా ఆయన్నే అనుకుని రాశాను. కొచిన్ వెళ్ళి కథ చెప్పగానే ఆయన ఓకే చేశారు. అసలు ఈ రెండు క్యారక్టర్లకూ వేరే ఆల్టర్నేటివ్ అనుకోలేదు” అంటున్నారు కొరటాల.

{youtube}onZQ57jRHL0{/youtube}

Related

  1. జనతా గ్యారేజ్ సెన్సార్ రివ్యూ!
  2. జనతా గ్యారేజ్ ని వెంటాడుతున్న ప్లాప్ సెంటిమెంట్ !
  3. జనతా గ్యారేజ్ స్టోరీ ఇదేనా?
  4. జనతా గ్యారేజ్ లో సాంగ్స్ కాపీ కొట్టిన దేవిశ్రీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -