Monday, May 13, 2024
- Advertisement -

రేపు మధ్యానం కబాలి సంగతి తేలిపోతుంది

- Advertisement -

స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతూ ఉంటె మొదటి రోజు మొదటి షో అయ్యే వరకూ ఒకటే టెన్షన్ గా ఉంటుంది. సినిమాకి మనం వెళ్ళినా వెళ్ళాక పోయినా టాక్ వచ్చేసే ఛాన్స్ ఉన్నప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాం. ఒక వేళ పని ఒత్తిడి వలన ఆఫీస్ కి లీవ్ దొరక్కపోతే టాక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం.

ఒక సాదా సీదా పెద్ద హీరో విషయం లోనే ఇలా ఉంటె ఇక రజినీకాంత్ లాంటి అతిపెద్ద స్టార్ హీరో సినిమా అంటే ఎంత హంగామా ఉంటుంది ? కబాలి సినిమా టాక్ కోసం అందరూ అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నానికే ‘కబాలి’ షో మొదలు కాబోతోంది. ‘కబాలి’ మీద జనాల్లో ఉన్న ఆసక్తి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

కాబట్టి వెంటనే సోషల్ మీడియా ద్వారా సినిమా టాక్ ఏంటన్నది కాసేపటికే తెలిసిపోతుంది. మరుసటి రోజు రెగ్యులర్ షోలు పడే టైంలోపే సినిమా ఫలితమేంటో తేలిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ‘కబాలి’ 60 దేశాల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. చాలా దేశాల్లో ముందు రోజే ప్రిమియర్ షోలు పడుతున్నాయి. అమెరికాలో 400కు పైగా స్క్రీన్లలో ‘కబాలి’ రిలీజవుతోంది.

Related

  1. బ్రేకింగ్ : లీక్ అయిపోయిన కబాలి సినిమా – ఆన్ లైన్ లో వచ్చేసింది
  2. అందరికంటే ముందే కబాలి సినిమాని చూసింది ఎవరో తెలుసా?
  3. రెండు గంటల్లో కబాలి టికెట్ లు ఓవర్
  4. కబాలి కోసం ఫ్లైట్ .. ప్రపంచం లో మొట్ట మొదటి సరిగా ..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -