Wednesday, May 1, 2024
- Advertisement -

నాకు చేతకాదు – డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

తెలుగు లో ఉన్న అతి తక్కువ మంది విలక్షణ డైరెక్టర్ లలో చంద్ర శేఖర్ యేలేటి కూడా ఒకరు. ఆయన సినిమాల్లో ఐతే దగ్గర నుంచీ మొన్న మొన్నటి సాహసం వరకూ అన్నీ ఆసక్తికరంగా ఉంటాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద రాణించక పోయినా అవార్డులు సొంత చేసుకోవడం లో మాత్రం యేలేటి ఫస్ట్ లో ఉంటారు. ఆయన డైరెక్టర్ గా మారిన 13 సంవత్సరాల టైం లో కేవలం ఐదు అంటే ఐదే సినిమాలు తీయడం విశేషం.

ఇప్పుడు ఆయన కొత్త సినిమా మనమంతా రాబోతోంది. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ని హీరోగా పెట్టి ఈయన తీసిన ఈ వింత ప్రయోగం ఎంతవరకూ ఆడుతుందో చూడాలి. కమర్షియల్ కథలు మీరు ఎందుకు ఎంచుకోరు అని అడిగిన ప్రశ్న కి యేలేటి చెబుతున్న సమాధానం ఆశ్చర్యంగా ఉంది. పెద్ద హీరోలు తో తీయచ్చుగా అంటే.. ‘‘హీరోల్ని దృష్టిలో ఉంచుకుని కథలు రాయడం తప్పేమీ కాదు.

నన్ను కూడా కొందరు హీరోలు మంచి కథలు ఉంటే సినిమా చేద్దామని అప్రోచ్ అయ్యారు. కానీ నేను వాళ్లను దృష్టిలో ఉంచుకుని కథలు రాయలేకపోయాను. ఫార్ములా ప్రకారం కమర్షియల్ సినిమాలు చేయడం నాకు చేతకాదని అనుకుంటా. వెంకటేష్ గారితో ఓ సినిమా చేయాల్సింది. ఆయనతో కలిసి ఏడాదిన్నర ట్రావెల్ చేశాను. అయినా సినిమా కుదర్లేదు’’ అని యేలేటి చెప్పాడు.

Related

  1. అఖిల్ కొత్త సినిమా డైరెక్టర్ ఇతనే ?
  2. ఛాన్స్ కోసం డైరెక్టర్ కోరిక తీర్చింది!’
  3. వీరప్పన్ భార్య ని దారుణంగా మోసం చేసిన డైరెక్టర్
  4. ఫామ్ హౌస్ కు వెళ్లి డైరెక్టర్ కోరిక తీర్చింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -