Thursday, May 16, 2024
- Advertisement -

కాజల్ పెళ్లి చేస్కోదట

- Advertisement -

కాస్త వయసొచ్చిన హీరోయిన్స్‌కి సంబంధించిన గాసిప్స్‌లో పెళ్లి ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. ఇక 28 – 30 ఏళ్లు దాటితే కచ్చితంగా ఆ విషయంపై అప్పటికే ఎవరితోనో డేటింగ్‌లో ఉందనో లేక పెళ్లికి రెడీ అనో అదీ కాకపోతే పెళ్లి సంబందాలు చూస్తున్నారనో రకరకాల గాసిప్పులు పుంకాను పుంకాలుగా వచ్చిపడుతుంటాయి.

అయితే ఇదే లిస్ట్ లో ఇప్పటికే చేరిన కాజల్.. తన పెళ్లి గురించి వస్తున్న గాసిప్స్‌కు చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. దాంట్లో భాగంగానే.. తన పెళ్లికి సంబందించిన కీలక విషయాన్ని చెప్పింది. కాజల్ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనీ మొన్నామధ్య వార్తలు హల్ చల్ చేశాయి. తన చెల్లెలిని చూసి పెళ్ళి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చిందని కూడా పుకార్లు వినిపించాయి.

అయితే తాజాగా వాటన్నింటికీ కాజల్ చెక్ పెట్టేసింది. మరో రెండు సంవత్సరాల వరకూ తాను పెళ్లి చేసుకోవడం లేదని తేల్చేసింది. మరో రెండేళ్లు తనని వదిలేయమనీ ఆ తరువాతే పెళ్ళి చేసుకుంటాననీ ఇప్పటికే తల్లిదండ్రులకి తేల్చి చెప్పేసిందట! అదే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది కాజల్!ఈ లెక్కన చూసుకుంటే… కాజల్ మరో రెండేళ్ల తర్వాత శ్రీమతి కాజల్ అయిపోతుందన్నమాట. ఆ విషయంలో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం తన పెళ్ళి వార్తల ఊహాగానాలను నిలిపివేయమంటూ పరోక్షంగా హెచ్చరిక చేసిందని టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.

Related

  1. ఇదిగో.. చిరుతో కాజల్ మాట్లడుతోంది!
  2. జనతా గ్యారేజ్ సినిమాలోకాజల్ ఐటెం సాంగ్
  3. సమంత తిట్టింది కాజల్ నేనా..!
  4. కాజల్ ముద్దు గోల

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -