Sunday, May 19, 2024
- Advertisement -

12 వేల హెక్టార్ల నష్టం

- Advertisement -

ఆకాల వర్షాలకు పంట పొలాలన్నీ నీట మునిగాయి. వరి, పత్తి, మొక్కజొన్న సహా వేలాది హెక్టార్లలో పంట నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. మెదక్ జిల్లాలో సుమారు 53 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. దాదాపు 20 వేల హెక్టార్లలో సోయాబీన్ పంట దెబ్బతిన్నదని భావిస్తున్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో సోయాను రైతులు ఎక్కువగా సాగు చేశారు.

మొక్కజొన్న, పత్తి, వరి పంటలు సైతం నీట మునిగాయి. 2 వేల హెక్టార్లలో కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలు నీట మునిగాయని అధికారులు తెలిపారు. మెదక్ జిల్లాలో సుమారు రూ.48.40 కోట్ల మేరకు పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా వ్యవసాయశాఖ అధికారులు అంచనాకు వచ్చారు. నిజామాబాద్ జిల్లాలో 20 వేల ఎకరాల పంట నీట మునిగింది. నవీపేట మండలం బినోలలోని పెద్ద చెరువుకు గండి పడటంతో వెయ్యి ఎకరాల పంట దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.

ఒకేసారి పంట చేనులను వరద ముంచెత్తడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో 12 వేల హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఖమ్మం జిల్లాలో గోదావరి వరద పెరుగుతున్నందున వరి పొలాలు ముంపునకు గురయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. పత్తి, మిర్చి తదితర పంటలు ఎర్రబడుతున్నాయి. ఈదశలో పంట నీటమునిగితే నోటికాడి ముద్ద దూరమైనట్లేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో అదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలో పత్తి, మిర్చి పంటలు నీట మునిగాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -