Monday, May 20, 2024
- Advertisement -

దేవినేని ఉమకు మళ్లీ నోటీసులు పంపిన సీఐడీ అధికారులు!

- Advertisement -

ఇటీవల టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా దేవినేని ఉమను నిన్న సీఐడీ అధికారులు 9 గంటల పాటు విచారించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు, వీడియో మార్ఫింగ్ అభియోగాలు పై అధికారులు నోటీసులు ఇవ్వటం జరిగింది. అయితే ఈ విచారణ లో ఉమా కి పలు ప్రశ్నలను సంధించారు అధికారులు.

అయితే దేవినేని ఉమా ప్రెస్ మీట్ లో ఉపయోగించిన సెల్ ఫోన్ మరియు టాబ్ లు ఎక్కడ అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే మే 1 వ తేదీన ఉదయం 11 గంటలకు మరొకసారి విచారణకు హాజరు కావాలి అంటూ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. దేవినేని ఉమా ఇచ్చిన వివరణ తో అధికారులు ఏ మాత్రం కూడా సంతృప్తి చెందలేదని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే దేవినేని ఉమకు సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు పంపారు. ఇదిలా ఉంటే.. దేవినేని ఉమా పై జరుగుతున్న విచారణ పట్ల ఒక పక్క టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇలా చేస్తున్నారు అని అధికార పార్టీ వైసీపీ పై ఆరోపిస్తున్నారు.

అలాంటి వారు పరీక్షలు రాయనవసరం లేదు : మంత్రి ఆదిమూలపు సురేశ్

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం… మే 8 వరకు నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు..

కన్నీరు పెట్టుకున్న సోనుసూద్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -