Friday, March 29, 2024
- Advertisement -

అలాంటి వారు పరీక్షలు రాయనవసరం లేదు : మంత్రి ఆదిమూలపు సురేశ్

- Advertisement -

ఏపీ ప్రభుత్వం ముందు నుంచి చెబుతున్నట్టే పరీక్షల నిర్వహణకు సిద్ధమైంది. మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా ప్రతి పరీక్ష కేంద్రం దగ్గర ప్రత్యేక కోవిడ్ ప్రొటోకాల్ ఆఫీసర్ ను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించవొద్దని.. అవసరమైతే కొంత కాలం వాయిదా వేయాలని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.

మరోవైపు కోవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ ఇంటర్మీడియెట్‌ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంపై ప్రభుత్వ అధికారులు ఫోకస్ చేశారు. తాజాగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తాజాగా మాట్లాడుతూ… కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులు పరీక్షలు రాయనవసరంలేదని పేర్కొన్నారు. వారికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి రెగ్యులర్ సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పారు.

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. మే 5 నుంచి 23 వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రతి విద్యార్థికి థర్మల్ స్క్రీనింగ్ చేశాకే ఎగ్జామ్ హాల్లోకి పంపుతామని అన్నారు.

ప్రభాస్ గురించి షాకింగ్ సీక్రెట్స్ రీవీల్ చేసిన బాహుబలి నటుడు!

ఇంట్లో ఫ్రెండ్ తో కలిసి రెచ్చిపోయిన నటి ప్రగతి.. వీడియో వైరల్!

ఢిల్లీలో రాష్ట్రపతి పాలన పెట్టండి.. ఎమ్మెల్యేగా సిగ్గుపడుతున్నానన్న షోయబ్ ఇక్భాల్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -