Friday, May 9, 2025
- Advertisement -

అనుష్క‌ను చూసిన త‌ర్వాత ఏవ‌రైనా అలాంటి నిర్ణ‌యం తీసుకుంటారా…

- Advertisement -
Keerthy Suresh Afraid Of Anushka Shetty..?

హాలీవుడ్‌లో , బాలీవుడ్‌లో అయినా చివరకు టాలీవుడ్ లో అయినా హీరో,హీరోయిన్లు తమ పాత్రలకు అవసరమైన మేరకు బరువు పెరగటం, శరీరాకృతిని పాత్రకు తగ్గట్టు మలుచుకునే ప్రయత్నం చేయడం సహజంగా చూస్తూనే ఉంటాం.

హీరోల‌కు క‌ల‌సి వ‌చ్చినా .. ఇలాంటివి హీరోయిన్లకి కలిసి రావని సైజ్‌ జీరో సినిమాతో అనుష్క తెలుసుకుంది.దానితోనే బాహుబ‌ళి 2 షూటింగ్ వాయిదా ప‌డింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

{loadmodule mod_custom,GA1}

అయితే ఇప్పుడు కీర్తిసురేష్ వంతు వ‌చ్చింది.మహానటి’ చిత్రంలో నటిస్తోన్న కీర్తి సురేష్‌తో పదిహేను కిలోల బరువు పెరగాలని చెప్పిన దర్శకుడికి ఆమె సారీ చెప్పేసిందట. సావిత్రి పాత్రలో అతికినట్టు కనిపించాలనే ఉద్దేశంతో ఆమెని బరువు పెరగాలని దర్శకుడు కోరాడట. అయితే అంత భారీ మార్పులకి తాను సిద్ధంగా లేనని, అవసరమైతే ప్రోస్థటిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌తో మేనేజ్‌ చేసుకోండని, బరువు పెరిగేదే లేదని చెప్పిందట.
పైగా ఆమె శరీరాకృతి కూడా సావిత్రి పాత్రకి సూట్‌ అవుతుందని అనుకున్నారు. కానీ ఈలోగా పెద్ద సినిమాల్లో అవకాశాలు పొందిన కీర్తి ఆ దర్శకుల డిమాండ్స్‌ మేరకు సన్నబడింది. ఇప్పుడు సావిత్రి చిత్రానికి ఆమెతో చిక్కొచ్చి పడింది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తాను బరువు పెరిగేది లేదని, అవసరమైతే, లావుగా కనిపించే దుస్తులు ధరించి నటిస్తానని తేల్చి చెప్తోందట కీర్తి. మరి లేకుంటే బరువు పెరిగాక ఎవరు పట్టించుకుంటారు. తగ్గాలంటే ఎంత కష్టమో అనుష్కను చూసాక తెలిసి తెలిసీ ఎవరు మాత్రం లావు పెరుగుతారా అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేసింది కీర్తి సురేష్‌.

{loadmodule mod_custom,GA2}

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}hdzwxegMYcg{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -