Saturday, April 20, 2024
- Advertisement -

కేజీఎఫ్ 2 పై ఓ రేంజ్ లో అంచనాలున్నాయిగా..?

- Advertisement -

దక్షిణాది నుంచి వచ్చిన బాహుబలి సినిమా తర్వాత దేశమంతటా పేరు సంపాదించుకున్న సినిమా కేజీఎఫ్.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ కన్నడ సినిమా ఒక్కసారిగా దేశాన్ని ఊపేసింది అని చెప్పొచ్చు.. ఈ సినిమా తో యష్ కూడా ప్రభాస్ లాగే దేశమంతటా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు..  2021 సంక్రాంతికి ఈ సినిమా ని రిలీజ్ చేయాలనీ చూస్తుండగా సినిమా థియేటర్లు ఈనెల 15 నుంచి ఓపెన్ అవుతున్న సంగతి తెలిసిందే.. 50 శాతం ఆక్యుపెన్సీతో తెరుచుకోవచ్చని అనుమతులు ఇచ్చినా కూడా ఇప్పటికిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెరిచే సీన్ కనిపించడం లేదు. ఒకటి రెండు మల్టీ ప్లెక్సులు తప్ప సింగల్ స్క్రీన్ యాజమాన్యాలు వేచి చూసే ధోరణిలో ఉన్నాయి.

ఇప్పటికే కరోనా తర్వాత కేజీఎఫ్ సినిమా మొదలయిపోయింది.  మొన్నటి నుంచి బాలన్స్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉన్న క్రేజ్ ఉన్న కెజిఎఫ్ 2 లాంటి సినిమాలు వస్తేనే బాక్సాఫీస్ కు ఊపొస్తుంది. జనం కూడా థియేటర్లకు వస్తారు. ఆ లోగా దాని కన్నా ముందు డిసెంబర్ లో క్రాక్, రెడ్, ఉప్పెన, అరణ్య లాంటి మూవీస్ లో ఒకటో రెండో వచ్చేస్తాయి కాబట్టి పబ్లిక్ అలవాటు పడిపోయి ఉంటారు. వందల కోట్ల రూపాయల పెట్టుబడితో ముడిపడిన ప్రాజెక్ట్ కాబట్టి నిర్మాతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న కెజిఎఫ్ 2లో సంజయ్ దత్ మెయిన్ విలన్ అధీరాగా నటిస్తుండగా సీనియర్ హీరోయిన్ రవీనాటాండన్ ప్రధాని ఇందిరా గాంధీని పోలిన పాత్రలో కనిపించనుంది. ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి కొత్త క్యాస్టింగ్ కూడా సీక్వెల్ లో తోడయ్యింది. త్వరలోనే టీజర్ వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కన్నడ ఫిలిం హిస్టరీలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన కెజిఎఫ్ 1 కి సీక్వెల్ కాబట్టి దానికి పదింతలు ఎక్కువ స్థాయిలో ఓపెనింగ్స్ రావొచ్చని అంచనా.

అల్లు అర్జున్ ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

త్రివిక్రమ్ కి ఎందుకింత డిమాండ్..?

పవన్ కళ్యాణ్ కేజిఎఫ్ తో తట్టుకుని నిలబడ గలడా..?

త్రివిక్రమ్ వల్ల మహేష్ , చరణ్ ల మధ్య గ్యాప్ పెరగనుందా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -