Friday, May 3, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ కేజిఎఫ్ తో తట్టుకుని నిలబడ గలడా..?

- Advertisement -

కరోనా నేపథ్యంలో మూతబడిన థియేటర్లు అక్టోబర్ 15 నుంచి తెరుచుకోనున్నాయి.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.. ఇప్పటికిప్పుడు సినిమాలు థియేటర్లలో రాలీస్ కాకపోయినా ఓ నెల రోజుల తర్వాత అయినా పెద్ద సినిమా లు రిలీజ్ అవుతాయన్న గ్యారెంటీ ఉంది.. దాంతో ఇప్పుడు రాబోయే పెద్ద సినిమాలపై  అందరి కన్ను ఉంది..

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాజకీయాలనుంచి సినిమాలకు రీ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న మొదటి సినిమా వకీల్ సాబ్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమా కి ఇది రీమేక్ కాగ పవన్ హీరోయిజానికి తగ్గట్లు స్క్రిప్ట్ లో మార్పులు చేసి ఈ సినిమా ని రూపొందిస్తున్నారు.. తొలిసారి పవన్ సినిమా కి సంగీతం వహిస్తున్నారు తమన్.  అయితే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఈ నెల 26 నుంచి షూటింగ్ మొదలుపెట్టుకోబోతున్నట్టు సమాచారం. నవంబర్ లో శృతి హాసన్ తో పాల్గొనే సింగల్ షెడ్యూల్ లో పవర్ స్టార్ తన భాగాన్ని పూర్తి చేస్తాడు. ఆ తర్వాత డిసెంబర్ లో ఫైనల్ కాపీ సిద్ధమవుతుంది. దానికి అనుగుణంగానే నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ ప్లానింగ్ జరుగుతోంది. అన్ని సరిగ్గా కుదిరితే చాలా తేలికగా సంక్రాంతి బరిలో దిగిపోవచ్చు.

అలాగే పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కిన కేజిఎఫ్ సినిమా కూడా సంక్రాంతి కి రిలీజ్ అయ్యే సూచనలు కనబడుతున్నాయట.. సంక్రాంతి అయితే అన్ని భాషల్లోనూ మంచి సీజన్ కాబట్టి వసూళ్ల పరంగా మంచి నమ్మకం పెట్టుకోవచ్చు. అందుకే ఆ దిశగా ప్లానింగ్ చేసుకుంటున్నారని బెంగుళూరు టాక్. ఒకవేళ ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే మాత్రం ఈ సంక్రాంతి కి పెద్ద యుద్ధమే జరుగుతుందని అంటున్నారు ఫాన్స్.. ఈ కాంబినేషన్ కనక తలపెడితే మాత్రం సంక్రాంతి థియేటర్లు కోట్ల రూపాయల వసూళ్లతో తడిసిపోవడం ఖాయం అనిపిస్తుంది..

OTT లకు సంక్షోభం.. అన్ని ఫ్లాప్ సినిమాలే.. సూర్య..?

బిగ్ బాస్ 4 కు నాగార్జున బై.. ఏం జరిగింది ?

మహేష్ , బన్నీ కి వారు కరువయ్యరుగా..?

పవన్ ఫ్యాన్స్ జోలికి వెళ్లిన దేవి నాగవల్లి.. ఏమైంది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -