Friday, March 29, 2024
- Advertisement -

ఇద్దరు యంగ్ హీరోల సినిమాల్లో బేబమ్మకు ఛాన్స్..!

- Advertisement -

వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన ఉప్పెన సినిమాతోనే కృతి శెట్టి కూడా హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమా భారీ సక్సెస్ కావడంతో బేబమ్మ కు యూత్ లో క్రేజ్ పెరిగిపోయింది. దీంతో నిర్మాతలు తమ తమ సినిమాల్లో ఈమెను నటింపజేసేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే కృతి శెట్టి చేతిలో నాని శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు సినిమా ఉండగా, లింగు స్వామి రామ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా కృతి శెట్టి నే హీరోయిన్ గా నటించనుంది.

ఇప్పుడు కృతి శెట్టి మరో ఇద్దరు యంగ్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ అందుకుంది. యంగ్ హీరో నితిన్ వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నితిన్ కొత్త దర్శకుడు శేఖర్ తో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టి ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే మరో హీరో నాగచైతన్య సినిమాల్లో కూడా నటించే ఛాన్స్ కృతి శెట్టిని వరించినట్లు టాక్. నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు తెరకెక్కనుంది. ఈ సినిమాలో నాగార్జున తో పాటు నాగచైతన్య కూడా నటించనున్నారు. ఇందులో నాగచైతన్యకు జోడీగా కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు టాక్. ఉప్పెన విజయం తర్వాత కృతి శెట్టి టాలీవుడ్లో వరుసగా సినిమా ఛాన్సులు అందుకుంటూ దూసుకుపోతోంది.

Also Read

లూసిఫర్ తర్వాత మొదలయ్యే చిరంజీవి సినిమాపై క్లారిటీ..!

మాట తప్పిన కాజల్​.. ప్రభాస్​ కోసమేనా?

మాస్​ డైరెక్టర్​తో విజయ్​ దేవరకొండ మూవీ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -