మీరు చూస్తున్న ఫోటోలో ఓ స్టార్ హీరో దాగి ఉన్నాడు. అవునండి మీరు వింటుంది నిజమే. ఈ ఫోటోలో ఓ స్టార్ హీరో ఉన్నాడు. ఇంతకి ఎవరా హీరో అని అనుకుంటున్నారా…?. మీరు చూస్తున్న ఫోటోలో ఉన్నది మరెవ్వరో కాదు ,1990లో లవర్ బాయ్‌గా చేసిన మాధవన్. సౌత్‌లో మాధవన్‌కు మంచి పేరుంది. ఇటీవలే ఆయన విలన్‌గా కూడా నటించారు. నాగచైతన్య సవ్యసాచి సినిమాలో విలన్‌గా నటించాడు మాధవన్. తాజాగా ఆయన ఓ బయోపిక్ మూవీలో నటిస్తున్నారు.
సుప్రసిద్ధ సైంటిస్ట్ నంబి నారాయణ్ కథ ఆధారంగా రూపొందుతున్న ఈ బయోపిక్‌లో లీడ్ రోల్లో నటిస్తున్నాడు మాధవన్. బయోపిక్‌లోని తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు మాధవన్. వీటిలో నిజమైన నంబి పక్కన ఫోటోలు దిగి పెట్టడంతో ఎవరు ఒరిజినల్ ఎవరు మాధవన్ అని పోల్చుకోవడం కష్టమయ్యింది. అయితే ఈ సినిమాకు మాధవన్ వట్టి హీరో మాత్రమే కాదు దర్శకుడు కూడా. మొదలుపెట్టిన అనంత్ మహదేవన్ మధ్యలోనే తప్పుకోవడంతో మాధవన్ దర్శకుడిగా మారి ఈ బయోపక్‌ను తెరకెక్కిస్తున్నాడు.
- Advertisement -
ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టండి ..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
