Monday, May 6, 2024
- Advertisement -

మహాత్మాగాంధీ బ‌స్‌స్టాండ్‌లో పార్కింగ్ పేరిట నిలువు దోపిడి

- Advertisement -

ఆసియాఖండంలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ బస్టేషన్‌లో పార్కింగ్ పేరిట ప్ర‌య‌ణికుల నుంచి అత్య‌ధిక ఫీజు వ‌సూలు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సంక్రాంతి పండుక సీజ‌న్‌ను క్యాష్ చేసుకునేందుకు అక్క‌డి పార్కింగ్ సిబ్బంది కక్కుర్తి ప‌డిన‌ట్లు తెలుస్తోంది. సాధార‌ణంగా ఎమ్‌జిబిఎస్ బ‌స్‌స్టాండ్‌లో పార్కింగ్ రోజుకి వ‌చ్చి 50 రూపాయిల అని బోర్డు మీద రాసి ఉంచ‌బ‌డింది కాని అక్క‌డ సిబ్బంది నిబంద‌న‌ల‌ను వ‌దిలేసి వారికి న‌చ్చినంత వ‌సూలు చేస్తున్నారు.

Related image


తాజాగా సంక్రాంతి పండ‌క్కి విజ‌య‌వాడ‌కు వెళ్తున్న ఓ జంట త‌మ బైక్‌ను ఎమ్‌జిబిఎస్ బ‌స్‌స్టాండ్‌లో పార్కింగ్ చేసి వెళ్లారు. వారు రావ‌డానికి 9 రోజులు ప‌ట్టింది. రోజుకి 50 రూపాయిలు చొప్పున్న 450 వ‌సూలు చేయాలి, కాని 9 రోజులుగాను రోజులుగాను 720 వ‌సూలు చేశారు. కాని ఆ యువ జంట చ‌దువుకున్న వారు కావ‌డంతో బోర్డు మీద ఉన్న పార్కింగ్ వివ‌రాల‌ను చూసి వారిని ఇదేమిట‌ని అడ‌గ్గా.. వారి నుంచి దురుస స‌మాధానం వ‌చ్చింది. దీంతో ఆ పార్కింగ్ బోర్డు మీద ఉన్న ఫిర్యాదుల ఫోన్ నెంబ‌ర్‌కు కాల్ చేయ‌బోతుండ‌గా .. కాల్ చేయ‌వ‌ద్ద‌ని వారికి స‌ర్థి చెప్పి వారి దగ్గ‌ర నుంచి వ‌సూలు చేసిన డ‌బ్బును తిరిగి ఇచ్చేశారు.

Image result for mgbs bike parking

వారు చ‌దువుకున్న వారు కావ‌డంతో ఇలా ఫిర్యాదు నెంబ‌ర్‌కు కాల్ చేయ‌డానికి రెడీ అయ్యారు. అదే చ‌దువుకొని వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఎమ్‌జిబిఎస్ బ‌స్‌స్టాండ్‌లో పార్కింగ్ సిబ్బంది చాలా ర్యాష్‌గా బిహేవ్ చేస్తారని గ‌తంలో చాలాసార్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇలా త‌మ‌కు న‌చ్చినంత పార్కింగ్ ఫీజు వ‌సూలు చేస్తు త‌మ దందాను కొన‌సాగిస్తున్నారు. ఇంత‌కు ముందు రోజుకి 20 రూపాయిలు మాత్ర‌మే వ‌సూలు చేసేవారు. కాని ఇప్పుడు ఈ పార్కింగ్ ఫీజు 50 రూపాయిల‌కు పెంచ‌డం జ‌రిగింది. ఇది చాల‌ద‌న్న‌ట్లు అక్క‌డి సిబ్బంది త‌మ‌కు తోచినంత తీసుకుంటున్నారు. ఇంత జ‌రుగుత‌న్న ఎమ్‌జిబిఎస్ బ‌స్‌స్టాండ్ అధికారులు ఏం చేస్తున్నారో తెలియడం లేదు.

Related image

ఇప్ప‌టికైన ప్ర‌భుత్వం క‌ళ్లు తెరిచి ఎమ్‌జిబిఎస్ బ‌స్‌స్టాండ్‌లో జ‌రిగే అక్ర‌మాల‌ను అరిక‌ట్టాల‌ని ప్ర‌య‌ణికులు కోరుతున్నారు. ఇక బ‌స్‌స్టాండ్‌లో ఫీజు విష‌యంలో కూడా కాస్తా త‌గ్గిస్తే బాగుంటుంద‌ని ప్రయ‌ణికులు ఆశిస్తున్నారు. రోజుకి 50 రూపాయిలు కాకుండా 20 రూపాయిలు అయితే సామ‌న్య ప్ర‌య‌ణికులకు కాస్తా ఊర‌ట క‌లుగుతుంద‌ని వారి వాద‌న‌. మ‌రి దీనిపై తెలంగాణ ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -