Sunday, April 28, 2024
- Advertisement -

దీపావళి రోజు ఎక్కువ అదృష్టం పొందడానికి వాస్తు టిప్స్!

- Advertisement -
how vastu can help you have happy diwali

దీపావళికి మరింత ఎక్కువ అదృష్టం పొందడానికి కొన్ని వాస్తు టిప్స్ ఫాలో అవ్వాలి. ఇంట్లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల దీపావళి సకల సౌభాగ్యాలు, సంపదలు పొందుతారు. దీపావళికి మరింత ఎక్కువ అదృష్టం పొందడానికి కొన్ని వాస్తు టిప్స్ ఫాలో అవ్వాలి.

ఇంట్లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల దీపావళి సకల సౌభాగ్యాలు, సంపదలు పొందుతారు. మరి దీపావళి లక్ష్మీని ఇంటికి ఆహ్వానించడానికి ఇంట్లో ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో చూద్దాం..

* దీపావళికి ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని ప్రతి మూలను చాలా శుభ్రంగా చేసుకోవాలి. చెత్త వంటివాటిని ఇంట్లో లేకుండా పడేయాలి.

* దీపావళి పండుగ రోజు ఇంట్లోని ఏ మూల కూడా.. చీకటిగా ఉండకూడదు. ఖచ్చితంగా ఇంట్లోని ప్రతి కార్నర్ ని వెలుగులతో నింపాలి.

* పవిత్రమైన స్వస్తిక్ గుర్తుని.. ఇంటి ముఖద్వారంపై అతికించాలి. ఇలా చేయడం వల్ల అదృష్టం వరిస్తుంది. ఇలా చేస్తే కేవలం దీపావళి రోజే కాదు.. ఎప్పటికీ ఈ సింబల్ ఉండటం మంచిది.

* వాస్తు ప్రకారం లక్ష్మీ పూజను ఇంట్లో ఉత్తరంవైపు చేయాలి. ఇలా చేస్తే సంపద సిద్ధిస్తుంది. పూజ చేసేటప్పుడు.. లక్ష్మీ విగ్రహానికి ఎడమవైపు ఖచ్చితంగా వినాయకుడి విగ్రహం పెట్టాలి.

* దూపం ఇంట్లో మంచి సువాసనను మాత్రమే కాదు.. ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. చందనం అగరబత్తీలనే దీపావళి రోజు ఉపయోగించాలి. ఇది.. ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది.

* దీపావళి రోజు ఖచ్చితంగా మెయిన్ డోర్ ఓపెన్ లోనే పెట్టుకోవాలి. ఇది.. మీరు ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నారని సూచిస్తుంది. నిద్రపోతున్నా కూడా.. కనీసం ఒక కిటికీ తలుపునైనా తీసి ఉంచడం వల్ల.. లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు అవుతుంది.

* కొద్దిగా ఉప్పును నీళ్లలో మిక్స్ చేసి.. ఇంటి చూట్టూ చిలకరించాలి. ముఖ్యంగా.. దీపావళి రోజు కంపల్సరీ ఉప్పు నీళ్లు చల్లాలి. ఉప్పు.. ఇంట్లో, గాలిలో ఉండే నెగటివిటీని గ్రహిస్తుంది.

* దీపావళి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదవడం వల్ల.. ఇంట్లో ఉండే ఎలాంటి దోషమైనా తొలగిపోతుంది. కాబట్టి దీపావళి రోజు ఈ మంత్రాన్ని జపించడం ఎట్టిపరిస్థితుల్లో మరిచిపోకండి.

Related

  1. గొప్ప మనసు ఉన్న వ్యక్తి రామ్ చరణ్
  2. రూపాయికే అన్‌లిమిటెడ్‌ 4జీ డేటా!
  3. అతి తక్కువ దరకే ఎయిర్‌టెల్ 10 జీబీ డేటా!
  4. ‘బాహుబలి 2’ ఫస్ట్‌లుక్‌ సంచలనం సృష్టిస్తోంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -