Sunday, May 19, 2024
- Advertisement -

నదియాకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మహేష్!

- Advertisement -

ప్రస్తుతం ఇండ‌స్ట్రీలో హీరో, హీరోయిన్ల కంటే స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్లు చేసే వాళ్లే ఎక్కవగా సంపాధిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు న‌దియా, రావు ర‌మేష్ లాంటి వాళ్ల రేట్లు చూస్తుంటే షాక్ కావాల్సిందే. ప‌వ‌న్‌కు అత్త‌గా చేసి చాలా పాపుల‌ర్ అయ్యింది న‌దియా. దాంతో వరస అవకశాలు రావడంతో సినిమా సినిమాకు రేటును పెంచేస్తోంద‌ట‌.

న‌దియా స్టార్ హీరోయిన్ల‌కు ధీటుగా త‌న రెమ్యునరేష‌న్ అడుగుతోందట. ఈమె న‌టించిన చిత్రాలు అన్ని హిట్ అవ్వడంతో నిర్మాత‌లు కూడా అడిగినంత ఇచ్చేస్తున్నారు. అయితే ఇప్పుడు మ‌హేష్‌-మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రంలో మ‌హేష్ త‌ల్లి పాత్ర కోసం ముందుగా న‌దియాను తీసుకున్నార‌ట‌. అయితే ఆమె భారీ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేయ‌డంతో ఆమె ప్లేస్ లోకి బిచ్చ‌గాడు ఫేమ్ దీపా రామానుజ‌న్ ను తీసుకున్నారు.

హీరోయిన్ల‌కు ధీటుగా పారితోషికం పెంచ‌డంతో నదియాతో నిర్మాత‌లు ప‌డ‌లేక‌పోతున్నారని తెలుస్తోంది. మొత్తానికి ప‌వ‌న్ అత్త‌గా మెప్పించిన న‌దియా.. మ‌హేష్ త‌ల్లిగా న‌టించే ఛాన్స్ మిస్ చేసుకుంది. అయితే మ‌హేష్ కూడా ముందుగా న‌దియా వైపు మొగ్గు చూపినా భారీ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేయ‌డంతో ఆమెను ప‌క్క‌న పెట్టేయ‌మ‌ని సూచించాడ‌ట‌.

Related

  1. మహేష్ కోసం రకుల్ ఏం చేసిందో తెలుసా?
  2. మహేష్ బర్త్ డే గిఫ్ట్ ఏంటంటే?
  3. చరణ్ కి ఊహించని షాక్ ని ఇచ్చిన మహేష్ బాబు
  4. మహేష్ ని ఎందుకు ఒద్దన్నాను అంటే – పరిణీతి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -