Monday, May 20, 2024
- Advertisement -

మహేష్ బర్త్ డే గిఫ్ట్ ఏంటంటే?

- Advertisement -

సూపర్ స్టార్స్ మహేష్‌బాబు ఓ గిప్ట్ ను తన పుట్టిన‌రోజున అభిమానుల‌కు ఇవ్వ‌బోతున్నాడ‌ట‌. ఆ గిఫ్ట్ ఏంటంటే.. మహేష్ చెయబోతున్న సినిమాకి సంబంధించి ప్రీ లుక్ ను రిలీజ్ చేయబోతున్నారట. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు, మురగదాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

మహేష్ కెరీర్ లోనే ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి  ప్రీ లుక్ ను ఆగ‌స్టు 9న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆగ‌స్టు 9వ తేదీ మహేష్ బర్త్‌డే కావడంతో అభిమానులకు గిఫ్ట్ గా ఈ ఈ ప్రీ లుక్ రిలీజ్ కు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నార‌ట‌.

ఇటీవలే ఈ సినిమా కోసం మహేష్ బాబు పై నిర్వహించిన లుక్ టెస్ట్ లోని ఫొటోలనే ప్రీ లుక్ గా రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. బ్రహ్మోత్సవం ప్లాప్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో మహేష్ ఫ్యాన్స్ లో ఇప్పుడు రాబోయే సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. మహేష్ సరసన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది.

Related

  1. చరణ్ కి ఊహించని షాక్ ని ఇచ్చిన మహేష్ బాబు
  2. మహేష్ ని ఎందుకు ఒద్దన్నాను అంటే – పరిణీతి
  3. మహేష్, ప్రభాస్ ల మీద కామెంట్స్ చేసిన చెర్రీ!
  4. మహేష్ ని అవమానిస్తున్న పవన్ ఫ్యాన్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -