Sunday, May 5, 2024
- Advertisement -

భార్యకు కండిషన్.. ఓకే అన్నాకే పెళ్లి చేసుకున్న మనోజ్

- Advertisement -
Manchu Manoj Conditions to His Wife Before Marriage

మంచు విష్ణు లాగే.. మంచు మనోజ్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన ప్రెండు ద్వారా కలిసిన ప్రణతితో ప్రేమలో పడి.. ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఇరు కుటుంబాలు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఐతే పెళ్లికి ముందు మనోజ్.. తన భార్యకు ఒక కండిషన్ పెట్టాడట. ఆ కండిషన్‍కి ఓకే అన్నాకే ఆమెను పెళ్లి చేసుకున్నాడట.

మరి ఆ కండిషన్ ఏంటో మనోజ్ మాటల్లోనే తెలుసుకుందాం.. ‘‘ నాకు.. నా భార్య మంచి ప్రెండ్. పెళ్లి చేసుకునే ముందు ఆమెకు ఒక మాటచెప్పాను. ‘నేను ఆర్టిస్టుని. డబ్బు దాచుకోవడం రాదు. ఇంట్లో డబ్బు అడగను. పరిస్థితులు బాలేకపోతే ఒకరి ముందు చెయ్యి చాచడం నాకు అలవాటు లేదు. భవిష్యత్తులో చిన్న అపార్టుమెంటుకో.. గుడిసెకో వెళ్లాలంటే నాతో పాటు వచ్చేయాలి’ అన్నాను. అందుకు ఆమె సరే అని అంగీకరించి.. ఎక్కడికైనా వస్తానని ఆమె నాతో ఏడడుగులు వేసింది’’ అని మనోజ్ చెప్పాడు.

నేను ఏ సినిమాలు చేస్తున్నానో.. ఎంత సంపాదిస్తున్నాను అనే విషయాలు తన భార్య ఎప్పుడూ అడగదని.. ఆమెకు సినిమాలంటే ఇష్టమని.. తాను చేసే సినిమాల్లో ఏదైనా నచ్చకపోతే వెంటనే మొహమాటం లేకుండా చెప్పేస్తుందని.. కొన్ని సందర్భాల్లో మంచి సలహాలు ఇస్తుంటుందని మనోజ్ తెలిపాడు. సినిమాల ఎంపిక మాత్రం ఎప్పుడూ తనదేనని.. తన భార్యతో పాటు తన తండ్రి కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోరని మనోజ్ తెలిపాడు.

{youtube}eZY3F_2dzCQ{/youtube}

Related

  1. ముడో భార్యకి కూడా పవన్ విడాకులు ఇవ్వబోతున్నాడా..?
  2. డైరెక్టర్ మాజీ భార్య తో చరణ్ రొమాన్స్!
  3. తమిళ స్టార్ హీరో తో స్టార్ హీరో భార్య రొమాన్స్!
  4. జబర్దస్త్ కమెడియన్ భార్య ఆత్మహత్య

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -