Wednesday, May 1, 2024
- Advertisement -

డైరెక్టర్ కి సూపర్ గిప్ట్ ఇచ్చిన ఎన్టీఆర్.. రేటు ఎంతో తెలుసా?

- Advertisement -
Jr NTR’s Costly Gift to K. S. Ravindra

ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్స్ ని హీరోలు అపురూపంగా చూసుకుంటున్నారు. గతంలో హీరోలు ఏది చెబితే దానికి డైరెక్టర్స్ సరే అనేవారు. ఇప్పుడు టాలెంట్ ఉన్న దర్శకులు ఇండస్ట్రీలో ఎక్కువ మంది కావాటంతో ఆ డైరెక్టర్స్ తో పనిచేసేందుకు స్టార్ హీరోలు సైతం క్యూలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే టాలెంట్ ఉన్న దర్శకులకి కావాల్సిన అన్నీ సదుపాయలను సమకూర్చాల్సిన అవసరం ఎంతో ఉందని పెద్ద హీరోలు అంటున్నారు. ప్రస్తుతం యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమా ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది.

అయితే ఈ సినిమా దర్శకుడికి ఎన్టీఆర్ భారీ గిప్ట్ ఇచ్చినట్టుగా టాలీవుడ్‍లో టాక్స్ వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ ఇప్ప‌టికే ఎన్నో రోల్స్‌ చేసిన.. ఇప్పుడు కొత్తగా క్రికెట్ బ్యాట్ ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ త‌న కొత్త సినిమాలో క్రికెట‌ర్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడ‌నేది దీని ఉద్ధేశం. ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) ఈ మూవికి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కి బాగా నచ్చిందట.

దాంతో బాబికి యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఓ భారీ గిప్ట్ ని ఇచ్చాడనే న్యూస్ తెగ వినిపిస్తోంది. ఎన్టీఆర్ కి వాచ్ లు అంటే చాలా ఇష్టం కాబట్టి… దర్శకుడు బాబీకి సైతం 4 లక్షల విలువైన వాచ్ ని గిప్ట్ గా ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ గిఫ్ట్ ఇవ్వడంతో డైరెక్టర్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే ఉండనుందని సమాచారం. ఇక ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సినిమా అలాగే  వివి వినాయక్‌తోనూ ఓ సినిమా చేయనున్నాడు. 

Related

  1. ఎన్టీఆర్ జై ల‌వ కుశ‌ లో చేసే మూడు రోల్స్ ఇవే
  2. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమా..?
  3. టాప్ దర్శకుడితో ఎన్టీఆర్ కొత్త సినిమా ఫిక్స్!
  4. అబ్బే.. ఎన్టీఆర్ ఏ మాత్రం మారలేదు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -