Tuesday, May 21, 2024
- Advertisement -

మేడ మీద అబ్బాయి మూవీ రివ్యూ

- Advertisement -

అల్లరి నరేష్.. హిట్ కొట్టి చాలా కాలం అయింది. దాంతో ప్రతి సినిమాతో హిట్ కొడుదాం అనుకున్న.. అతనికి కాలం కలిసిరాక.. చేసిన సినిమాలు అన్ని ప్లాప్ అవుతున్నాయి. సుడిగాలి సినిమా తర్వాత అల్లరి నరేష్.. ఆ రెంజ్ హిట్ కొట్టాలేకపోయాడు. మధ్యలో జేమ్స్ బాండ్ వచ్చిన.. అది ఓ రేంజ్ హిట్ మాత్రం కాలేదు. దాంతో ఈ సారి ఎలగైన హిట్ కొట్టాలని.. అల్లరి నరేష్, శ్రీనివాస్ అవసరాల, హైపర్ ఆది, నిఖిల తదితరల కాంబినేషన్ లో ప్రజీత్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా మేడ మీద అబ్బాయి. ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఈ మేడ మీద అబ్బాయి..‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ అనే సూపర్ హిట్ మలయాళ సినిమా రీమేక్. పక్కింటి అమ్మాయితో చాటుగా తీసిన సెల్ఫీ వల్ల “అల్లరి నరేష్” కు ఎలాంటి కష్టాలు వచ్చాయి అనేదే ఈ సినిమా. మరి అతని పిరికితనాన్ని ధైర్యంగా ఎలా మర్చుకున్నాడు.. అసలు ఏం చేసాడు అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

రొమాంటిక్ కామెడీగా వచ్చిన ఈ సినిమాకి స్క్రీన్ ప్లే సూపర్ అని చెప్పాలి. అల్లరి నరేష్ తనదైన శైలీలో వినోదానికి అందించాడు. ఉత్కంఠభరిత సన్నివేశాలు సినిమాలో హైలైట్. జబర్దస్త్ ప్రోగ్రాం తో హైలైట్ అయిన హైపర్ ఆది, ఈ సినిమాలో నరేష్ కు ఫ్రెండ్ గా నటించాడు. ఆది తనదైన శైలిలో పంచ్ డైలాగ్స్ తో సినిమా అంత నవ్వులు పోయించాడు. అంతే కాదు ఈ సినిమాకు మాటలు అందించింది కూడా ఇతడే. ఇందులో డైలాగ్స్ తో పాటు ఉన్ని ఎస్‌. కుమార్‌ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కోనసీమ అందాలను చాలా చక్కగా చూపించడమే కాదు హీరో హీరోయిన్లను గ్లామర్ గా చూపించి సక్సెస్ అయ్యాడు. .షాన్‌ రెహమాన్‌ అందించిన సంగీతం కూడా పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. నిఖిల విమల్, అవసరాల శ్రీనివాస్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ప్లస్ పాయింట్స్ :

* అల్లరి నరేష్, హైపర్ ఆది కామెడీ
* నిఖిల విమల్ , అవసరాల శ్రీనివాస్ రోల్స్
* పంచ్ డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :

కొన్ని చోట్ల రొటీన్ కామెడీ మాదిరి అనిపిస్తోంది.
హీరో, హీరోయిన్ మధ్య కొన్ని సీన్స్
సంగీతం

మొత్తంగా :

ఈ మూవీ లో అల్లరి నరేష్ కామెడీ బాగా వర్కవట్ అయింది. అలానె హైపర్ ఆది పంచ్ డైలాగ్స్ బాగున్నాయి. హీరోయిన్, ఇతర నటినటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు సినిమాని బాగా తెరకెక్కించాడు. చాల ఏళ్ల తర్వాత నరేష్ పూర్తిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఓ డిఫరెంట్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా కొత్త నరేష్ ను చూసిన ఫీలింగ్ కలిగించాడని చెప్పవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -