Monday, May 6, 2024
- Advertisement -

చేపలు కావాలా.. అయితే మీ ఇంటి దగ్గరలో ఇలా..!

- Advertisement -

తెలంగాణలో మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటుతో పాటు ప్రజలకు ఆరోగ్యపుష్టి దొరుకుతోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు తెలిపారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌ హెచ్ఎండీఏ మైదానంలో సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు హరీశ్​రావు, తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ, 29 జిల్లాలకు 117 సంచార చేపల విక్రయ వాహనాలు పంపిణీ చేశారు.

గతంలో ఏ ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదని… తెలంగాణ వచ్చాకే బడ్జెట్‌లో మత్స్యశాఖకు రూ.100 కోట్లు కేటాయించినట్టు మంత్రి తలసాని తెలిపారు. మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల ద్వారా నీటివనరులు పెరిగాయన్నారు. ఉచిత చేపపిల్లల పంపిణీతో ఉత్పత్తి పెరిగిందని వివరించారు. సంచార వాహనాల ద్వారా మత్స్యకార మహిళలకు ఉపాధి లభిస్తోందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో మూడు నాలుగు చోట్లే చేపలు దొరుకుతున్నాయన్న హరీశ్‌రావు… మంత్రి తలసాని చొరవతో సంచార చేపల విక్రయ వాహనాలు ఏర్పాటు కావటం సంతోషమన్నారు. మంచినీళ్లలో పెరిగే చేపలకు రుచి ఎక్కువ అని… తెలంగాణలో చేపలు మంచినీటిలోనే పెంచుతున్నాయని వివరించారు.

తెలంగాణలో చెరువులకు మహర్దశ వచ్చిందన్నారు. ఏడాదంతా చెరువులు నిండుగా ఉండేలా నింపుతున్నామన్న హరీశ్‌రావు… ప్రభుత్వం ఉచితంగా చేపలు, రొయ్యలు పంపిణీ చేస్తోందని హరీశ్​రావు తెలిపారు.

మ‌ణిశ‌ర్మ బీటూ.. చిరు స్టెప్పూ !

మళ్లీ లాక్‌డౌన్ అవ‌స‌రముండదు: ఏపీ హోం మంత్రి

తెలంగాణలో ‘బ‌హిరంగ’ ఆంక్ష‌లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -