క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కు క‌రోనా

- Advertisement -

క్రికెట్ గాడ్‌, భారత దిగ్గజ క్రికెట‌ర్ సచిన్ టెండూల్కర్ కు క‌రోనా సోకింది. త‌న‌కు స్వ‌ల్పంగా అనారోగ్యంగా అనిపించ‌డంతో క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌నీ, కరోనా సోకిందని స‌చిన్ టెండూల్క‌ర్ వెల్ల‌డించాడు. శ‌నివారం ఉద‌యం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు.

“నేను తాజాగా కోవిడ్‌-19 ప‌రీక్ష‌లు చేయింకుకున్నాను. పాజిటివ్ గా వ‌చ్చింది. వైద్యుల స‌ల‌హా మేర‌కు ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు. అలాగే, “ఇంట్లో వాళ్లంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించ‌గా వారికి నెగ‌టివ్ గా వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఇంట్లో ఒక గ‌దిలో క్వారంటైన్ లో ఉండి వైద్యం చేయించుకుంటున్నాన‌ని” తెలిపారు.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశంలోని ఆరోగ్య సంర‌క్ష‌ణ నిపుణులు, వైద్యులకు కృతజ్ఞ‌త‌లు తెలిపారు. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండండి అంటూ పేర్కొన్నారు. ఇటీవల రాయ్ పూర్ లో జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఛాలెంజ్ పోటీల్లో సచిన్ పాల్గొన్నాడు. దేశంలో ఇటీవ‌ల ప‌లువురు ప్ర‌ముఖులు క‌రోనా బారిన‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇక దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా మ‌హారాష్ట్రలో అధికంగా కేసులు న‌మోద‌వుతున్నాయి.

హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్.. ఆయ‌న ఐదు బెస్ట్ సినిమాలు ఇవిగో !

దేశంలో ఒక్క‌రోజే 62,258 క‌రోనా కేసులు

పుణెలో భారీ అగ్నిప్రమాదం.. 448 షాపులు దగ్దం

సినీ వ‌ర్గాల‌ను వ‌ద‌ల‌ని క‌రోనా

బ్లాక్ కాఫీతో ఆ సమస్యలన్నీ పరార్

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -