యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 135 కోట్ల కలెక్షన్లు వసులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రికార్డు కి బద్దలు కొట్టిండు సూపర్ స్టార్ మోహన్ లాల్.
మలయాళంలో 50 కోట్లు రావడమే గ్రేట్ అనుకుంటున్న రోజుల్లో ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరడమే కాకుండా 135 కోట్ల వసూళ్ళ ని కేవలం 66 రోజుల్లో సాధించి ఎన్టీఆర్ రికార్డు కు ఎసరు పెట్టాడు మోహన్ లాల్ తన పులి మురుగన్ సినిమాతో. ఈ సినిమా మలయాళ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించడంతో పాటు జనతా గ్యారేజ్ రికార్డు ని కూడా బద్దలు కొడుతోంది.
ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ కూడా ముఖ్య పాత్ర పోషించారు. జనతా గ్యారేజ్ సినిమా 135 కోట్లు వసూల్ చేయగా పులి మురుగన్ చిత్రం కూడా 135 కోట్ల ని సాధించి ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. దాంతో జనతా గ్యారేజ్ ని పక్కకు నెట్టి పులిమురుగన్ చిత్రం ముందు వరుసలో చెరింది.
Related