Thursday, April 25, 2024
- Advertisement -

థియేటర్ లో సినిమా చూడాలని ఉందా? అయితే అక్కడికి వెళ్లండి?

- Advertisement -

కరోనా లాక్​డౌన్​ ఎఫెక్ట్​తో థియేటర్లు మొత్తం బంద్​ అయ్యాయి. ప్రేక్షకులకు వినోదం కరువైంది. ఓ వైపు కరోనా పీడిస్తుంటే ఎంటర్​ టైయిన్​ మెంట్​ కావాల్సి వచ్చిందా? అనే వారు ఉన్నారు. కరోనా ఫస్ట్​వేవ్​ టైంలో కూడా థియేటర్లు మూతపడ్డాయి. అప్పుడు ఓటీటీలకు ఫుల్​ గిరాకీ ఏర్పడింది. ఇక థియేటర్లకు కాలం చెల్లిపోయినట్టేనని.. ఇప్పుడంతా ఓటీటీల యుగమంటూ విశ్లేషణలు సాగాయి. కానీ ఆ తర్వాత థియేటర్లు రిలీజ్​ కాగానే మళ్లీ జనం ఎగబడ్డారు. దీంతో తెలుగునాట, ఆ మాటకొస్తే.. మొత్తంగా మనదేశంలోనే థియేటర్లకు ఇంకా మార్కెట్ ఉందని రుజువైంది.

ప్రేక్షకులు ఓటీటీలో చూసేదానికంటే బిగ్​ స్క్రీన్​లో చూడటంలోనే ఎక్కువ థ్రిల్​ ఫీల్​ అవుతారని అర్థమైంది. థియేటర్లు లేనప్పుడు గత్యంతరం లేక ఓటీటీలను ఆశ్రయిస్తారు. అంతేతప్ప.. థియేటర్ల క్రేజ్​ తగ్గలేదు. అయితే ఓటీటీలకు ప్రత్యేక ప్రేక్షకులు ఉన్నారు అది వేరే విషయం. మరోవైపు తెలుగు నాట సింగిల్​ స్క్రీన్​ థియేటర్ల శకం దాదాపు ముగిసినట్టే. ప్రస్తుతం మల్టిప్లెక్స్​లు మాత్రమే ఎక్కవగా నడుస్తున్నాయి. కరోనా సెకండ్​ వేవ్​ రావడంతో మళ్లీ థియేటర్లు క్లోజ్​ అయ్యాయి.

Also Read: థర్డ్​వేవ్​.. చిన్నపిల్లల తల్లిదండ్రులూ బీకేర్​ఫుల్​..!

ప్రస్తుతం కరోనా కేసులు తగ్గాయి కాబట్టి .. త్వరలో థియేటర్ లు తెరుచుకొనే అవకాశం ఉంది. ఏపీలో ప్రస్తుతం ఓ థియేటర్​ ఓపెన్​ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్​ వైరల్​ అయ్యింది. అసలు ఏపీలో ఓపెన్​ అయిన థియేటర్​ ఏది? ఎక్కడ? తెలుసుకుందాం.. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని విశాఖ‌ప‌ట్నం జ‌గ‌దాంబ థియేటర్​ ఇప్పుడు తెరుచుకున్నది. ఈ థియేటర్​లో ప్రస్తుతం క్రాక్​ సినిమా ఆడుతోంది.

ఏపీలో ప్రస్తుతం లాక్​డౌన్​ నిబంధనలు సడలించిన విషయం తెలిసిందే. ఉద‌యం 6-12 గంట‌ల మ‌ధ్య జ‌నాలు బ‌య‌ట తిరిగేందుకు, వ్యాపారాలు నిర్వ‌హించుకునేందుకు ఉన్న వెసులుబాటును ఇంకో రెండు గంట‌లు పొడిగించింది. దీంతో ఈ థియేటర్​ను తెరిచారు. ప్రస్తుతం కొత్త సినిమాలు విడుదల చేసేందుకు ఎవరూ ముందుకు రారు. పైగా ప్రేక్షకులు కూడా సినిమాలు చూసే మూడ్​లో లేరు. దీంతో చాలా చోట్ల ఇంకా థియేటర్లు తెరవలేదు. కానీ కరోనా సెకండ్​వేవ్​ తర్వాత తెరుచుకున్న మొదటి థియేటర్​గా జగదాంబ థియేటర్​ నిలిచింది.

Also Read: స్టార్ హీరోలూ.. రెమ్యూనరేషన్ కాస్త తగ్గించుకోండి బాబూ..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -