Tuesday, April 23, 2024
- Advertisement -

సీతగా ఆమెనా.. అస్సలు ఒప్పుకోం..!

- Advertisement -

ప్రస్తుతం చారిత్రక, పురాణేతిహాస, జానపద చిత్రాల వైపుకు దర్శకులు, నిర్మాతలు మొగ్గుచూపుతున్నారు. ఇటువంటి చిత్రాలకు పాన్​ఇండియా స్థాయిలో మార్కెట్ ఉండటమే అందుకు కారణం.. చారిత్రక కథతో తెరకెక్కిన బాహుబలి పాన్​ ఇండియా లెవెల్​లో భారీ కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రానికి కథను అందించిన విజయేంద్రప్రసాద్​, దర్శకుడు రాజమౌళికి దేశవ్యాప్తంగా మార్కెట్ ఏర్పడింది. బాలీవుడ్​, కోలీవుడ్​ ఇలా అన్ని భాషల నిర్మాతలు విజయేంద్ర ప్రసాద్​ను కథ కోసం సంప్రదిస్తున్నారు.

విజయేంద్ర ప్రసాద్​ కథ అందించిన ‘బాహుబలి’, ‘భజరంగి భాయిజాన్’, ‘మణికర్ణిక’ భారీ కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే. అయితే విజయేంద్రప్రసాద్​ ఇప్పుడు బాలీవుడ్​లో ఓ భారీ ప్రాజెక్టుకు కథను అందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు అలౌకిక్ దేశాయ్ సీత కోణంలో రామాయణాన్ని తెరకెక్కించాలని భావించారు. ఇందుకోసం విజయేంద్రప్రసాద్​ కథను సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో సీత పాత్ర కోసం దర్శకుడు వెదుకుతున్నాడు. తొలుత అలియాభట్​ను తీసుకుందామని భావించారు. ఆ తర్వాత కరీనా కపూర్​ను ఆ స్థానానికి ఫిక్స్​ అయ్యారు. ఈ మేరకు వార్తలు వచ్చాయి. అయితే కరీనా కపూర్​ను సీతగా అస్సలు అంగీకరించబోమని ఓ వర్గం గట్టిగా పట్టుబడుతున్నది.

Also Read: బాలీవుడ్​ను ఆదుకొనేది అక్షయేనా?

ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని .. ముస్లింగా మారిపోయిన కరీనాను సీతగా పెడితే ఈ చిత్రాన్ని అడ్డుకుంటామని హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో నిర్మాతలకు చిక్కు వచ్చి పడింది. ప్రభాస్​ హీరోగా.. రామాయణం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రావణాసురిడిగా సైఫ్​ అలీఖాన్​ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఆయన భార్యను సీతగా ఎంపిక చేయబోతుంటే మాత్రం విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో వేచి చూడాలి. దర్శక నిర్మాతలు సీతగా కరీనానే ఫిక్స్​ అవుతారా? లేక మరోనటిని సంప్రదిస్తారా? అన్న విషయం వేచి చూడాలి.

Also Read: కమల్​ను ఇండియన్​ -2 శనిలా వెంటాడుతోంది?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -