Friday, May 3, 2024
- Advertisement -

కరోనాకు కాక్​టెయిల్​ అద్భుతంగా పనిచేస్తోందట..!

- Advertisement -

కరోనా రెండోదశలో ప్రజలకు చుక్కలు చూపించింది. మొదటి దశలో కేవలం వృద్ధులకే సోకిన మహమ్మారి రెండో దశలో యువత, మధ్యవయస్కుల వారి మీద ప్రభావం చూపించింది. రెండో దశలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. మరోవైపు ఆక్సిజన్​ దొరకక.. బెడ్లు ఖాళీలేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే కరోనాకు ఇప్పటి వరకు కచ్చితమై ఔషధం అందుబాటులో లేదు. ఐవర్​మెక్టిన్​, హైడ్రాక్సిక్లోరోక్విన్​, ఫాబీఫ్లూ వంటి మందులు పనిచేస్తున్నట్టు డాక్టర్లు పేర్కొన్నారు.

అయితే కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీరియస్​ అయినవాళ్లకు రెమిడెసివర్​ ఇంజెక్షన్లు ఇచ్చారు. అయితే ఈ ఇంజెక్షన్లు ఎంతవరకు పనిచేశాయో తెలియదు కానీ.. వాటి ద్వారా బ్లాక్​ఫంగస్​ అనే కొత్త రోగం వచ్చింది. ఐవర్​మెక్టిన్​ , రెమిడెసివిర్​ వాడొద్దంటూ డబ్ల్యూహెచ్​వో పేర్కొన్నది. దీంతో కరోనాకు కచ్చితమైన చికిత్స లేకుండా పోయింది. తక్కువ లక్షణాలు ఉన్నవాళ్లకు ఈ వ్యాధి నయం అవుతున్నది. కానీ పరిస్థితి విషమించిన వాళ్లకు మాత్రం రోగం నయం కావడం లేదు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్​లోని ఏషియన్​ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ గాస్ట్రోఎంటరాలజీ వైద్యులు కాక్​టెయిల్ మందు బాగా పనిచేస్తున్నట్టు చెబుతున్నారు. గత ఏడాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనా బారిన పడగా ఈ మందు ఆయన చికిత్సకు ఆ విషయం తెలిసిందే. ఈ యాంటీ బాడి కాక్​టెయిల్​ను తీసుకున్న 40 మంది రోగుల్లో కోవిడ్​ లక్షణాలు తగ్గుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. 24 గంటల్లోనే ఈ మందు ఫలితాలు ఇస్తున్నట్టు తెలిపారు.

40 మంది రోగులకు మోనో క్లోనల్ యాంటీ బాడీలున్న సింగిల్ డోస్​ కాక్​టెయిల్​ ఇచ్చామని డాక్టర్లు చెప్పారు. 24 గంటల్లో వారికి పరీక్షలు చేయగా.. కరోనా నెగిటివ్​ వచ్చిందని డాక్టర్లు అంటున్నారు. దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని కొందరు నిపుణులు అంటున్నారు. కరోనా పేరుతో చాలా కార్పొరేట్​ ఆస్పత్రులు మాత్రం దోపిడీకి తెరలేపాయి. కరోనా కు మందు లేదంటూనే లక్షల్లో ఫీజు వసూలు చేయడం ఏమిటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.

Also Read

థర్డ్​వేవ్​.. చిన్నపిల్లల తల్లిదండ్రులూ బీకేర్​ఫుల్​..!

విశ్వాసం అంటే ఇదే..! యజమాని కోసం అంబులెన్స్​ వెంట కుక్క పరుగు..!

లైవ్​లో ‘గజరాజు’ మూవీ చూసినట్టుంది? వీడియో వైరల్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -