Saturday, May 18, 2024
- Advertisement -

కృష్ణ – మహేష్ – గౌతం – మనం లాంటి సినిమా ?

- Advertisement -

మహేష్ బాబు , ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ , ఆయన కొడుకు గౌతం కృష్ణ కలిసి ఒక సినిమా తీస్తున్నారు అంటే అంతకంటే గొప్ప విశేషం మహేష్ ఫాన్స్ కి ఉంటుందా ? తమ అభిమాన హీరో కొడుకు, తండ్రి కలిసి మనం లాంటి సినిమా తీస్తున్నారు అనే వార్త ఇప్పుడు మహేశ్ ఫాన్స్ ని ఉబ్బి తబ్బిపోయెలా చేస్తోంది.

భవిష్యత్తు లో గౌతం హీరో అవ్వాలి అని కోరుకుంటున్న అభిమానులు 1 నేనొక్కడినే సినిమాలో గౌతం నటన కి ముగ్ధులు అయ్యారు. తాజాగా టాలీవుడ్ సర్కిల్స్ లో వినిబడుతున్న వార్తల ప్రకారం సూపర్ స్టార్ ‘కృష్ణ’ సూపర్ హిట్ చిత్రమైన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రాన్ని ‘గౌతమ్ కృష్ణ’ హీరోగా రీమేక్ చేస్తున్నారని, ఇప్పటికే కథ దాదాపుగా సిద్ధమైందని, ఈ చిత్రానికి దర్శకుడిగా ‘కృష్ణ వంశీ’ ని అనుకుంటున్నారని తెలుస్తోంది.

ఈ చిత్రం మొత్తం సీతారామరాజు చిన్నతనంలో పడ్డ కష్టాల నైపథ్యంలో సాగుతుందని కూడా అనుకుంటున్నారు. కానీ ఈ వార్తపై మహేష్ బాబు నుండి ఎటువంటి సమాచారమూ అందలేదు. కనుక ఇందులో ఎంతమేర వాస్తవముందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Related

  1. పీవీపీ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన మహేష్ బాబు
  2. మహేష్ సినిమాలో నమ్రత ఏ రోల్ చేస్తుందటే?
  3. ఈ అలవాటు మహేష్ కు ఉంది!
  4. నదియాకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మహేష్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -