Saturday, April 20, 2024
- Advertisement -

భూమిలోకి కుంగిన ఇల్లు..

- Advertisement -

ఇల్లు మరమ్మతు చేస్తుండగా కింది ఫ్లోర్ ఒక్కసారిగా భూమిలోకి కుంగిపోయింది. కరీంనగర్ కార్ఖానాగడ్డలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా అలజడి రేపింది. గుమ్మం కోసం తవ్వుతుండగా భవనం కూలిపోయిందని స్థానికులు చెప్తున్నారు.

ఈ ఇల్లు 40 ఏళ్ల కిందట నిర్మించిందని.. ఆ కాలంలోనే సెల్లార్ నిర్మించారని ఇరుగు పొరుగు వారు అంటున్నారు. ఈ సెల్లార్ కారణంగా, దీంతో పాటు పునాది సరిగా లేకపోవడం వల్ల ఇల్లు కుంగిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరమ్మతు పనులు జరుగుతున్నందున ఇంట్లో ఎవరూ లేరు. దీంతో ప్రమాదం తప్పింది. ఐతే, మరమ్మతు పనుల్లో ఉన్న ఇద్దరు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. స్థానికులు వారిని బయటకు తీసుకొచ్చి 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. వారిద్దరూ స్వల్పంగా గాయపడ్డారని స్థానికులు చెప్తున్నారు.

ఒమైక్రాన్ ఎక్కడ పుట్టింది..? పుట్టుకకు కారణం ఏంటీ..?

కొత్తగా ట్రై చేశారు.. ఇంప్లిమెంటేషన్‌ ఫెయిల్.. ఏం జరిగింది..?

రన్నింగ్‌ బస్సులో మంటలు .. రెప్పపాటులో..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -