దళితబంధు ఛైర్మన్ అన్నారు. ఎమ్మెల్సీ అన్నారు. ఏదో ఒక నామినేటెడ్ పదవి అన్నారు. ఇవేమీలేవు ఏ పదవి ఇవ్వలేదు. మరి నెక్ట్ ఏంటీ రాజ్యసభ ఎంపీ ఆఫర్ చేస్తారా.. ఇదిగో తీసుకోమంటూ చేతులో పెడుతారా.. దళిత నేతలకు పధవులు దక్కడం లేదు దళిత జనోద్దరణ జరుగడంలేదు. అవకాశం దొరికినప్పుడల్లా ఉదరగొట్టే గులాభీ బాస్ ఆ లీడర్ విషయంలో మెత్తపడుతున్నారా.. ఊరించీ ఊరించీ ఇంకా ఊగిస లాటలోనే ఉంచుతారా.. ఇంతకీ ఎవ్వరా నాయకుడు
మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ రాజకీయాల్లో మోస్ట్ బ్రాండ్ పొలిటికల్ లీడర్. ఎవ్వరిని విమర్శించిన బాక్స్ బద్దలవ్వాల్సిందే మాటల తూటాలు పేల్చుతే అవతల వాల్ల గుండెకు తాకాల్సిందే టీడీపీలో ఉన్నప్పుడు లక్ష్మీ బాంబులా పేలిన ఈ లీడర్.. గులాభీ గూటిలో తోక టపాకాయ అయ్యారనే చర్చ జరుగుతోంది. సహజ సిద్దమైన దూకుడు స్వభావానికి భిన్నంగా మారిపోయారు. ఏపార్టీలో ఉంటే ఆ పార్టీ అధినేతను ఆకాశానికి ఎత్తే ఈ నాయకుడు.. గులాభీ నాయకునిపై పొగడ్తల స్వరాన్ని అందుకున్న ఫలితం లేదట! ఎంత పొగడ్తలతో ముంచెత్తినా జేజేలు పలికినా ప్రయోజనం కన్పించడం లేదట తెలంగాణ భవన్ మెట్లెక్కి ఎన్నాళైంది. ఇంకెన్నాళ్లు ఖాళీగా ఉండాలంటూ ఎదురుచూస్తున్నారటా
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందుకు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన మోత్కుపల్లి ఇప్పుడు ఆయన విషయంలో సైలెంట్ అయ్యారట. 30సంవత్సరాలు కూడా ఉండని యువ నాయకుడు కౌశిక్ రెడ్డికి పదవి ఇచ్చిన కేసీఆర్ తనకూ ఏదో ఒక పదవి ఇవ్వకపోతారా అని మోత్కుపల్లి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు గతంలో తనపై మోత్కుపల్లి వాడిన భూతుల పురాణాన్ని గుర్తుంచుకున్న కేసీఆర్ మోత్కుపల్లికి కావలనే ఎలాంటి పదవి ఇవ్వడంలేదనే టాక్ వినిపిస్తోంది. తనను అన్న మాటలకు మోత్కుపల్లి కుంగి కుంగి ఏడ్చేలా చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి.
ఏపీలో మళ్లీ త్రిమూర్తులు రాబోతున్నారా ?
