Monday, May 20, 2024
- Advertisement -

ఆడ‌పిల్ల‌లు వేసుకునే డ్రెస్‌ల‌పై కామెంట్ చేసిన మెగాబ్ర‌ద‌ర్‌

- Advertisement -

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు గ‌త కొంత‌కాలంగా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజులు క్రితం హీరో బాల‌య్య‌పై కామెంట్స్ చేశాడు నాగ‌బాబు. త‌రువాత ఏకంగా ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టి రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌డం మొద‌లుపెట్టాడు నాగ‌బాబు. ఈ వీడియోస్‌లో ఏపీ మంత్రి నారా లోకేశ్‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌లు గ‌తంలో ప‌లు సంద‌ర్భాల‌లో మాట్లాడిన వాటికి సెటైర్ వేస్తు కొన్ని వీడియోల‌ను విడుద‌ల చేశాడు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబును సైతం వ‌దిలిపెట్ట‌లేదు నాగ‌బాబు. ఇదింతా నాగ‌బాబు త‌మ్ముడు ప‌వ‌న్ కోస‌మే చేస్తున్నార‌ని చిన్న పిల్లాడికి సైతం అర్థం అవుతోంది. ఈ విష‌యం ప‌క్క‌న పెడితే నాగ‌బాబు తాజాగా మ‌రో వీడియోను విడుద‌ల చేశాడు. ఈ వీడియోలో నాగ‌బాబు ఆడ‌పిల్ల‌లు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ గురించి ప్ర‌స్తావించారు. ఈ మధ్య గౌరవనీయులైన కొంతమంది వ్యక్తులు ఆడవాళ్ల డ్రెస్సింగ్ గురించి మాట్లాడారు. ఆడవాళ్లు సంప్రదాయ బద్ధమైన వస్త్రాలను ధరించాలని వాళ్లు చెప్పారు. కురుచ దుస్తులు వేయ‌డం వ‌ల్లే స‌మాజంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. ఆడవాళ్లు శరీరాన్ని పూర్తిగా కప్పివుంచే వస్త్రాలను ధరించాలని చెప్పారు. అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. ఆడవాళ్లు శరీరాన్ని పూర్తిగా కప్పివుంచే వస్త్రాలను ధరించాలని చెప్పారని ప్ర‌శ్నించారు నాగ‌బాబు.

ఆడ‌పిల్లలు ఫ‌లానే డ్రెస్సులే వేసుకోవాలని ఎక్క‌డైనా రాసి ఉంది అని ఆయ‌న వారిని ప్ర‌శ్నించారు.ఎలాంటి డ్రెస్ లు వేసుకోవాలనేది ఆడపిల్లల హక్కు .. దానిని కాదనడానికి మీరెవరు? . పూర్తిగా క‌ప్పుకున్న వారిపై అత్య‌చారాలు జ‌ర‌గ‌వ‌ని మీరు హామీ ఇస్తారా..? బూజుపట్టిపోయిన సంప్రదాయాలను పట్టుకుని వెళ్లాడుతున్నార‌ని వారిపై త‌న అసహనాన్ని ప్రదర్శించారు. ముందు స‌మాజంలో అబ్బాయిల‌ను ఎలా పెంచాలో నెర్పించ‌డ‌ని వారికి చురుక‌లు అంటించాడు నాగ‌బాబు. ఇంతకి నాగ‌బాబు ఎవ‌రి గురించి మాట్లాడారో తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -