Friday, May 3, 2024
- Advertisement -

భార‌త్‌తో టీ20 సిరీస్‌కు ముందే న్యూజిలాండ్‌కు పెద్ద ఎదురు దెబ్బ‌..

- Advertisement -

న్యూజిలాండ్‌ గడ్డపై వన్డే సిరీస్‌ని భారత్ జట్టు ఘనంగా ముగించింది. వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ జట్టు 35 పరుగుల తేడాతో విజ‌యం సాధించింది. సిరీస్‌ను 4-1తో కైవ‌సం చేసుకుంది. వ‌న్డే సిరీస్ విజ‌యంతో టీ20 సిరీస్ మీద కూడా గురి పెట్టింది భార‌త్‌.

వ‌న్డేసిరీస్ గెలిచి మంచి ఊపుమీదున్న టీమిండియా టీ20 సిరీస్‌కు సిద్ద‌మవుతోంది. మ‌రో వైపు వన్డే సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్‌కు భారీ ఎదురు దెబ్బ‌త‌గిలింది. కీవీస్ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు మార్టిన్ గుప్తిల్ టీ20ల‌కు దూర‌మయ్యారు.వెన్నునొప్పితో బాధపడుతున్న గప్టిల్‌.. టీ20 సిరీస్‌ మొత్తానికి దూరమవుతున్నాడని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. అత‌ని స్థానంలో జేమ్స్‌ నీషమ్‌ను జట్టులోకి తీసుకున్నారు.

భారత్‌తో చివరిదైన ఐదో వన్డేకు గప్టిల్‌ దూరమైన సంగతి తెలిసిందే. గప్టిల్‌ కోలుకోవడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో టీ20 సిరీస్‌కు సైతం దూరం కావాల్సి వస్తుందని కివీస్‌ కోచ్‌ గ్యారీ స్టీడ్‌ తెలిపాడు. ఈ నెల 13వ తేదీ నుంచి బంగ్లాదేశ్‌తో ఆరంభమయ్యే వన్డే సిరీస్‌ నాటికి గప్టిల్‌ జట్టుతో కలిసే అవకాశం ఉంద‌ని తెలిపారు.

భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య బుధవారం నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టీ20 ఫిబ్రవరి6వ తేదీన వెల్లింగ్టన్‌ వేదికగా జరుగుతుండగా, ఫిబ్రవరి 8వ తేదీన ఆక్లాండ్‌ వేదికగా రెండో టీ20 , ఫిబ్రవరి 10వ తేదీన హామిల్టన్‌ వేదికగా మూడో టీ20 జరుగనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -