Thursday, May 16, 2024
- Advertisement -

బాలయ్య, లోకేష్……. మరీ ఇంత గర్వమా? అధికారం నెత్తికెక్కిందా?

- Advertisement -

ఒక రొటీన్ రొడ్డకొట్టుడు మసాలా సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమం అది. కానీ ముఖ్య అతిధిగా హాజరైన లోకేష్, బాలయ్యల మాటలు మాత్రం గర్వానికి పరాకాష్టలా ఉన్నాయి. మాదే చరిత్ర, మేమే గొప్పోళ్ళం, చరిత్ర సృష్టించాలన్న మేమే, ఆ చరిత్ర తిరగరాయాలన్నా మేమే అని బాలయ్య, లోకేష్‌లు ఒకరి గురించి ఒకరు…..ఎవరు గురించి వాళ్ళు చెప్పుకున్న మాటలు వింటూ ఉంటే ఇంత గర్వం అవసరమా అనిపించింది. ఎంత అధికారంలో ఉంటే మాత్రం గర్వం మరీ ఎక్కువైనట్టుగా మాట్లాడడం ఏంటి?

ఇప్పుడిదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. విజయవాడ-గుంటూరు అంటేనే కుల పిచ్చి ఏ స్థాయిలో ఉంటుందో టిడిపి భజన మీడియానే ఎన్నో సార్లు వార్తలు రాసింది. అలాంటి చోట బాలకృష్ణ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్. వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ప్రేక్షకులను చూసి రెచ్చిపోయారో…….లేక ఆ వర్గ ప్రేక్షకులను ఇంకా రెచ్చగొట్టాలనుకున్నారో కానీ బాలయ్య, లోకేష్‌ల ప్రసంగాలు మాత్రం హద్దులు దాటిపోయాయి. చంద్రబాబునాయుడు కూడా ఈ స్థాయిలో ఎప్పుడూ మాట్లాడింది లేదు. ఆల్రెడీ యూట్యూబ్‌లో చాలా మంది ఆవేశపరులైన వాళ్ళు ఆ వర్గం గురించి గొప్పగా మాట్లాడుతూ ఇతరులందరినీ దారుణంగా అవమానించిన వీడియోలు ఉన్నాయి. ఇక చిరంజీవిని అయితే ఎంత దారుణంగా అవమానిస్తూ వీడియోలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వర్గం బ్లడ్ అంటూ ఒక టిడిపి నాయకుడు చాలా మంది టిడిపి నాయకుల సమక్షంలో చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు అయితే జుగుప్స కలిగించేలా ఉన్నాయి. ఇప్పుడు జై సింహా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో బాలయ్య, లోకేష్ ప్రసంగాలు అలాంటి వాళ్ళను ఇంకా రెచ్చగొట్టేలా ఉన్నాయి. ప్రజాప్రతినిధులుగా ఉన్న బాలయ్య, లోకేష్‌లే ఈ స్థాయిలో రెచ్చిపోతే ఇక వాళ్ళను గుడ్డిగా అభిమానించే మూఢాభిమానులు రెచ్చిపోరా? ఇదే విషయాన్ని ఇప్పుడు నెటిజనులు ప్రస్తావిస్తున్నారు. ముందు ముందు అయినా గర్వాన్ని కాస్త తగ్గించుకుని సంయమనంతో వ్యవహరిస్తే సమాజానికి, మరీ ముఖ్యంగా అంతర్జాతీయ రాజధాని అని గ్రాఫిక్స్ ప్రచారం చేయిస్తున్న ప్రాంతానికి చెడ్డపేరు రాకుండా ఉంటుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -