Friday, May 3, 2024
- Advertisement -

షర్మిల దీక్ష ఫలితం.. లాభామా నష్టమా?

- Advertisement -

గత కొన్ని రోజులుగా తెలంగాణలో వైఎస్ షర్మిల చుట్టూ రాజకీయం కొనసాగుతోంది. ఆమె పాదయాత్రలో భాగంగా టి‌ఆర్‌ఎస్ నేతలపై ఘాటైన విమర్శలు చేయడం, ఆ తరువాత ఆమె అరెస్ట్ కు గురికావడం, ఫలితంగా వైతెపా, టి‌ఆర్‌ఎస్ నేతల మద్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వంటి పరిణామాలతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాగా షర్మిల గతంతో పోలిస్తే ప్రస్తుతం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆమె చేస్తోన్న పాదయాత్రలో భాగంగా కే‌సి‌ఆర్ మరియు టి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ప్రధానంగా టార్గెట్ చేసుకొని వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తూ పోలిటికల్ హిట్ ను పెంచుతోంది. దాంతో టి‌ఆర్‌ఎస్ శ్రేణులు తప్పక స్పందించాల్సిన పరిస్థితి రావడంతో షర్మిల వర్సస్ టి‌ఆర్‌ఎస్ అనే విధంగా రగడ కొనసాగుతోంది.

అయితే ఆమె చేస్తోన్న వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదు పోలీసులు. ఆ మద్య కూడా పోలీసులు షర్మిల పాదయాత్రను అడ్డగించగా, ఆమె కోర్టు ను ఆశ్రయించింది. అయితే కోర్టు పాదయాత్రకు అనుమతి ఇచ్చినప్పటికి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయరాదని షరతు విధించింది. ఇక తన పాదయాత్ర మళ్ళీ కొనసాగించే సమయంలో పోలీసులు మాత్రం అనుమతి నిరాకరించారు. దీంతో కోర్టు నుంచి అనుమతి వచ్చినప్పటికి పోలీసులు ఎందుకు అనుమతి లేదని ఆమె ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఇప్పటికే ఆమె రెండు రోజులనుంచి నీరు, ఎలాంటి ఆహారం తీసుకోకుండా దీక్షలో ఉన్నారు. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

కాగా ప్రస్తుతం షర్మిల వర్సస్ టి‌ఆర్‌ఎస్ మద్య చోటు చేసుకుంటున్న ఈ రాజకీయ రగడ వైతెపా కు ప్లేస్ అయ్యే అవకాశం ఉందని కొందరు రాజకీయవాదాలు చెబుతున్నారు. ఎందుకంటే షర్మిల చుట్టూ చోటు చేసుకుంటున్న ఈ రాజకీయం తరచూ ప్రజల్లో నానుతోంది. దాంతో షర్మిల ప్రజల్లో సానుభూతి పొందే అవకాశం ఉంది. షర్మిల వ్యూహం కూడ అదే అయి ఉండవచ్చని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా షర్మిలను టి‌ఆర్‌ఎస్ టార్గెట్ చేస్తోందనే భావన కూడా ప్రజల్లో ఏర్పడే అవకాశం ఉంది. దీని వల్ల టి‌ఆర్‌ఎస్ కు లాభామా నష్టమా అనే విషయం కాస్త పక్కన పెడితే.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మాత్రం లాభమే అనే వాదన వినిపిస్తోంది. అందువల్ల ప్రస్తుతం ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న షర్మిల.. పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇస్తే ఈ వ్యవహారంలో షర్మిల పైచేయి సాధించినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే ప్రజల్లో ఆమెపై సానుభూతి పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఎటొచ్చి ఈ వ్యవహారమంతా షర్మిలకు అనుకూలంగా మారుతోందనేది రాజకీయవాదుల నుంచి వినిపిస్తున్న మాట.

ఇవి కూడా చదవండి

జగన్ను ప్రశ్నించడమే నేరమా.. ఎందుకీ దాడులు?

కే‌సి‌ఆర్ చేస్తే నీతి.. ఇతరులు చేస్తే అవినీతా ?

పవన్ కోసం బాబు కాంప్రమైజ్ కావాల్సిందే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -