Thursday, May 2, 2024
- Advertisement -

ఏపీలో బి‌ఆర్‌ఎస్ .. ఎవరికి ముప్పు ?

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల టి‌ఆర్‌ఎస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో భారత రాష్ట్ర సమితి గా రూపాంతరం చెందింది. దీంతో ఇకపై కే‌సి‌ఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా నేషనల్ పాలిటిక్స్ ను ప్రభావితం చేసేలా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే జాతీయ రాజకీయాల్లో కే‌సి‌ఆర్ ఎంతవరకు ప్రభావం చూపగలరనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. ఇక జాతీయ పార్టీగా బి‌ఆర్‌ఎస్ ను ప్రకటించినప్పటికి జాతీయ పార్టీ హోదా దక్కడం అంతా సులువైనా విషయం కాదు. డిల్లీ వరకే పరిమితం అయిన అం ఆద్మీ పార్టీకి జాతీయ హోదా రావడానికి పదేళ్ళు పట్టింది. .

కాగా కేవలం జాతీయ పార్టీగా ప్రకటన మాత్రమే ఉన్న బి‌ఆర్‌ఎస్ కు ఆ హోదా దక్కాలంటే చాలా సవాళ్ళనే ఎదుర్కోవలసి ఉంటుంది. కనీసం నాలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీ హోదా ఉండాలి. ఈ నేపథ్యంలో బి‌ఆర్‌ఎస్ కు ప్రాంతీయ పార్టీ హోదా కల్పించేందుకు కే‌సి‌ఆర్ ముందు ఉన్న మొదటి ఆప్షన్ ఏపీలో బి‌ఆర్‌ఎస్ ను బలపరచడం, అలాగే ఇతర రాష్ట్రాలలో కూడా బి‌ఆర్‌ఎస్ ను విస్తరించడం. ఇదిలా ఉంచితే ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణల ప్రకారం కే‌సి‌ఆర్ ఏపీ పై ఫోకస్ చేస్తే బి‌ఆర్‌ఎస్ ప్రభావం ఏపీ ఎలా ఉండబోతుందనేదే ఇప్పుడు పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మొదటి ప్రశ్న. ప్రస్తుతం ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బలమైన క్యాడర్ కలిగి ప్రధాన పార్టీలుగా వెలుగొందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోకి బి‌ఆర్‌ఎస్ ఏంటి ఇచ్చిన పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చనేది పోలిటికల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న సమాచారం.

ఎందుకంటే కే‌సి‌ఆర్ అనగానే తెలంగాణ వ్యక్తిగానే ఏపీ ప్రజలు భావిస్తారు.. అంతేకాకుండా చాలా సందర్భాల్లో కే‌సి‌ఆర్ ఏపీపై ఘాటైన విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలు బి‌ఆర్‌ఎస్ ను తెలంగాణ పార్టీగానే చూస్తారు తప్పా.. జాతీయ పార్టీగా చూసే అవకాశం లేదనేది మరికొందరి వాదన. ఇక ఇప్పటివరకు ఏపీపై తీవ్ర విమర్శలు గుప్పించిన టి‌ఆర్‌ఎస్ నేతలు.. ఇప్పుడు ఏపీ రాజకీయాలను ఎలా ప్రస్తావిస్తారనేది ఆసక్తికరం. కాగా ఇప్పటికే ఏపీలో బి‌ఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి సంబంధించిన అన్నీ పనులు వేగంగా జరుగుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే కే‌సి‌ఆర్ ఫోకస్ ముందు ఏపీపైనే ఉందనే విషయం స్పష్టమౌతోంది. ఏది ఏమైనప్పటికి జాతీయ పార్టీ హోదా కోసం ముందు ఏపీ పైన ఫోకస్ చేస్తోన్న బి‌ఆర్‌ఎస్.. రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపనుంది ? బి‌ఆర్‌ఎస్ ఎంట్రీ వల్ల ఏపీలో ఏ పార్టీకి లాభం చేకురనుంది.. ఏ పార్టీకి నష్టం వాటిల్లనుంది ? ఇలాంటి విషయాలపై స్పష్టత రావాలంటే మరి కొన్నాళ్లు ఎదురు చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఆంధ్ర తెలంగాణ మళ్ళీ కలిసేనా.. ఏంటి ఈ కొత్త చర్చ ?

బాబు, పవన్ ఇద్దరు.. జగన్నే నమ్ముకున్నారా !

చంద్రబాబు స్టైల్ మార్చింది ఆయనే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -